Margashirsha Purnima 2024: ఈ మంత్రాలను పఠిస్తే.. ఉద్యోగుల సమస్యలు తీరుతాయి
09 December 2024, 10:06 IST
- Margashirsha Purnima 2024: ఉద్యోగుల సమస్యలు తీరాలంటే మార్గశిరమాసంలో ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన ఉద్యోగుల కష్టాలు గట్టెక్కుతాయి. డిసెంబర్ 15న మార్గశిర పూర్ణిమ. లక్ష్మీనారాయణనను ఆ రోజు ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. ఆ రోజు ఉద్యోగులు ఈ మంత్రాలని పఠించడం వలన వారి సమస్యలు తీరిపోతాయి.
ఈ మంత్రాలను పఠిస్తే.. ఉద్యోగుల సమస్యలు తీరుతాయి
లక్ష్మీదేవి పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు కనపడతాయి. లక్ష్మీనారాయణకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసం. మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు పూజ చేయడం వలన లక్ష్మీదేవి మంచి ఫలితాలను అందిస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే అనేక పర్వదినాలను హిందువులు జరుపుతారు. విష్ణువుకు ఇష్టమైన ఈ నెలలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు మాసాన మార్గ శీర్షాహం అని అన్నారు. మార్గశీర్షం అంటే ఎంతో శ్రేష్టమైనది అని అర్థం. కార్తికేయడు, దత్తాత్రేయుడు, కాలభైరవుడుతో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే.
లేటెస్ట్ ఫోటోలు
తులసిమాలతో లక్ష్మీనారాయణడును పూజించడం వలన మంచి ఫలితాలు కనబడతాయి. మార్గశిర మాసంలో గురువారం నాడు మహాలక్ష్మిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఇక ఇది ఇలా ఉంటే చాలా మంది ఉద్యోగులు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
మార్గశిర పూర్ణిమ
ఉద్యోగుల సమస్యలు తీరాలంటే మార్గశిరమాసంలో ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన ఉద్యోగుల కష్టాలు గట్టెక్కుతాయి. డిసెంబర్ 15న మార్గశిర పూర్ణిమ. లక్ష్మీనారాయణనను ఆ రోజు ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. ఆ రోజు ఉద్యోగులు ఈ మంత్రాలని పఠించడం వలన వారి సమస్యలు తీరిపోతాయి. కష్టాల నుంచి గట్టెక్కొచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
గృహ, రుణ సమస్యలు
ఓం శ్రీం హ్రీం శ్రీం కమల్ కమలాలయే ప్రసిద్ధ్ ప్రసిద్ధ్ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని మార్గశిర పౌర్ణమి నాడు విష్ణువు ముందు చదువుకోవాలి. ఈ శ్లోకం చదివితే గృహంలో ఇబ్బందులు ఉన్నా లేదా పేదరికం ఉన్నా తొలగిపోతాయి. మార్గశీర్ష పూర్ణిమ రోజున ఈ ప్రత్యేక మంత్రాన్ని జపిస్తే రుణ విముక్తి కలుగుతుంది.
జీవితంలో, వృత్తిలో ఆటంకాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మార్గశీర్ష పూర్ణిమ నాడు జపించాలి. ఈ రోజున శ్రీ హరిని పూజిస్తే లక్ష్మీదేవి దయ కలుగుతుంది. జీవితంలో, వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి.
సంపద
ఓం యక్షయ్ కుబేరాయ వైశ్రవణాయ ధన్ ధాన్యాధిపతయే అని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా ఆనంద పడతాడు. కుబేరుడి ఆశీస్సులు కలిగితే సంపద పెరుగుతుంది.
మానసిక ఒత్తిడి
ఓం ఐం క్లీం సోమాయ నమః అని మార్గశిర పూర్ణిమ నాడు రాత్రి చంద్రునికి నీళ్ళు సమర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. అలా చేయడం వలన మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.