Makara Rasi Today: మకర రాశి వారు ఈరోజు ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు, తోబుట్టువు మీకు సాయం
07 September 2024, 7:47 IST
- Capricorn Horoscope Today: రాశి చక్రంలో 10వ రాశి మకర రాశి. ఈరోజు సెప్టెంబరు 7, 2024న శనివారం మకర రాశి వారి కెరీర్, ఆర్థిక, ఆరోగ్య, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
మకర రాశి
Makara Rasi Phalalu 7th September 2024: మకర రాశి వారికి ఈరోజు ఆఫీసులో కొత్త పనులు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ జీవితంలో వచ్చిన సమస్యలు పరిష్కారమవుతాయి.
లేటెస్ట్ ఫోటోలు
ప్రేమ
వివాహితుల సంబంధాల్లో ఆనందం ఉంటుంది. కొందరు మకర రాశి వారు ఈరోజు మాజీ ప్రేమికులను కలుస్తారు. ఇది సానుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ప్రేమ జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. మీ భాగస్వామి భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండండి. వారి మనస్సును గాయపరిచే లేదా సంబంధంలో అపార్థాలను పెంచే ఎలాంటి విషయాలను భాగస్వామికి చెప్పవద్దు. మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. మీ భావోద్వేగాలను మీ భాగస్వామికి బహిరంగంగా వ్యక్తపరచండి.
కెరీర్
ఆఫీస్‌లో ఈరోజు మకర రాశి వారు కొత్త సర్ ప్రైజ్ లు పొందుతారు. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మీ ప్రత్యేక నైపుణ్యాలు, ప్రతిభతో విజయ మెట్లు ఎక్కుతారు. కొత్త ఎదుగుదల అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి. కార్యాలయంలో సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేస్తారు. ఇది అన్ని పనులలో ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది.
ఆర్థిక
నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి నిధులు సులభంగా లభిస్తాయి. కొంతమంది జాతకులు సాయంత్రానికల్లా కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని యోచిస్తారు. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. తోబుట్టువుల సహాయంతో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
ఆరోగ్యం
ఈ రోజు మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. కొంతమందికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. జంక్ ఫుడ్ తినడం మానుకోండి. ఇంట్లో వండిన భోజనం తినండి. పనుల్లో ఎక్కువ ఒత్తిడికి లోనుకావద్దు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతుల్యతను పాటించండి. ఈ రోజు కొంతమంది జాతకులకు తలనొప్పి లేదా కాళ్ళలో నొప్పి అనిపించవచ్చు.