(1 / 6)
భార్యభర్తల మధ్య గొడవలు జరగడం అనేది సాధారణంగా ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్లే ఎక్కువసార్లు ఇవి జరుగుతుంటాయి. దీంతో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. అయితే, కొన్ని టిప్స్ క్రమపద్ధతిలో పాటించడం వల్ల ఇద్దరి మధ్య గొడవలను, విభేదాలను పరిష్కరించుకోవచ్చు. ఆ స్టెప్స్ ఏవో ఇక్కడ చూడండి.
(Pexels)(2 / 6)
ముందుగా విభేదాలు ఎందుకు వచ్చాయో ఇద్దరూ గుర్తించాలి. వాళ్ల బంధానికి ఇబ్బందిగా ఉన్న విషయాలేంటో స్పష్టంగా గుర్తు చేసుకోవాలి.
(Unsplash)(3 / 6)
విభేదాల విషయంలో ఇద్దరూ నిజాయితీతో ఉండాలి. అసలు వాదన ఎందుకు జరిగింది.. గొడవ ఎక్కడ, ఏ విషయంలో మొదలైందో సమస్య మూలాన్ని గుర్తించేందుకు ప్రయత్నించాలి.
(Pixabay)(4 / 6)
గొడవలో ఎవరు ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడారో బాధ్యత తీసుకొని ఆలోచించాలి. గొడవ పెద్దది కావడంలో తప్పు ఎవరి వైపు ఉన్నా వారు నిజాయితీతో అంగీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
(Unsplash)(5 / 6)
మీ జీవిత భాగస్వామి కోణం నుంచి కూడా ఆలోచించాలి. అసలు గొడవ వల్ల పరిష్కారం నిజంగా దొరుకుతుందా అనేది గుర్తుచేసుకోవాలి. వీటివల్ల చాలా శాతం విభేదాలు తొలగిపోతాయి.
(Unsplash)ఇతర గ్యాలరీలు