తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని ప్రభావాన్ని జయించిన మహాత్ముడు పిప్పలాదుడు -బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ

శని ప్రభావాన్ని జయించిన మహాత్ముడు పిప్పలాదుడు -బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ

HT Telugu Desk HT Telugu

21 December 2024, 8:06 IST

google News
    • పిప్పలాద మహర్షి భారత ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేకమైన స్థానం కలిగిన మహానుభావుడు. ఆయన పేరు వినగానే శని ప్రభావాన్ని జయించిన అద్భుత వ్యక్తి, ప్రశ్నోపనిషత్తు రచయిత, కఠోర తపస్సు చేసిన జ్ఞాని అని గుర్తుకువస్తుంది ఆధ్యాత్మిక వేత మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు
శని ప్రభావాన్ని జయించిన మహాత్ముడు పిప్పలాదుడు
శని ప్రభావాన్ని జయించిన మహాత్ముడు పిప్పలాదుడు

శని ప్రభావాన్ని జయించిన మహాత్ముడు పిప్పలాదుడు

లేటెస్ట్ ఫోటోలు

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

2025 జనవరిలో మాళవ్య రాజయోగంతో వీరికి ధన యోగం, ఊహించని ప్రయోజనాలు!

Dec 19, 2024, 06:09 AM

పిప్పలాద మహర్షి భారత ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేకమైన స్థానం కలిగిన మహానుభావుడు. ఆయన పేరు వినగానే శని ప్రభావాన్ని జయించిన అద్భుత వ్యక్తి, ప్రశ్నోపనిషత్తు రచయిత, కఠోర తపస్సు చేసిన జ్ఞాని అని గుర్తుకువస్తుంది ఆధ్యాత్మిక వేత మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.

పిప్పలాదుడు మహర్షి దధీచి కుమారుడు. దధీచి మహర్షి తన అస్తికలను దేవతలకు దానం చేసి, వారి కోసం వజ్రాయుధాన్ని సృష్టించేందుకు సహాయం చేశాడు. ఆయన భార్య తన భర్త మరణాన్ని తట్టుకోలేక, త్రీవ దుఃఖంలో తన కుమారుడు (పిప్పలాదుడు)ను ఒక పెద్ద రావి చెట్టు రంద్రంలో ఉంచి స్వయంగా చితిలో కూర్చుకుంది. ఈ విధంగా పిప్పలాదుడు అనాథగా మారి, రావి చెట్టు రంద్రంలో ఉండి, చెట్టు ఆకులు, పండ్లు తింటూ జీవనం సాగించాడు ఆధ్యాత్మిక వేత మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు

ఒకరోజు దేవర్షి నారదుడు రావి చెట్టుని దర్శించి, అందులోని చిన్న బాలుడిని చూశాడు. అతనితో సంభాషణ చేస్తూ, అతని పుట్టుక, తండ్రి గురించి వివరాలను తెలిపాడు. మహర్షి దధీచి తన అకాల మరణానికి కారణం శనిదేవుని ప్రభావమని చెప్పాడు. నారదుడు పిల్లవాడికి “పిప్పలాద” అనే పేరు పెట్టి, అతనికి తపస్సు మార్గాన్ని సూచించాడు ఆధ్యాత్మిక వేత మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.నారదుడి మాటలను పాటించి, పిప్పలాదుడు కఠోర తపస్సు ప్రారంభించాడు. ఆయన తపస్సుకు సంతృప్తి చెంది బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రసన్నమై “ఎలాంటి వరమైతే కావాలో కోరుకో” అని అన్నాడు. పిప్పలాదుడు రెండు కీలకమైన వరాలు అడిగాడు:

1. పుట్టిన తొలి ఐదు సంవత్సరాల్లో పిల్లల జాతకాల్లో శని ప్రభావం లేకుండా చేయాలి.

2. సూర్యోదయానికి ముందు రావిచెట్టుకు నీరందించే వారిని శనిదోషం లేకుండా చేయాలి. ఇలా బ్రహ్మ ఈ రెండు వరాలను మంజూరు చేశాడు.

శనిదేవుని ప్రభావం

శనిదేవుని ప్రభావం వల్ల తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, దుఃఖాలు పిప్పలాదుని క్రూర తపస్సుకు మూలకారణం అయ్యాయి. శనిదేవుని పై పిప్పలాదుడు ఉన్న కోపంతో, తన తపస్సులో సంపాదించిన శక్తితో శనిని కాల్చడం ప్రారంభించాడు. శని బాధను భరించలేకపోయి సూర్యదేవుడు బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మ పిప్పలాదుని శాంతింపజేయడంతో, శని దేవుడు పునర్జీవితం పొందాడు ఆధ్యాత్మిక వేత మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.

తరువాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తు అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. ఇది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైనది. ఇందులో ఆధ్యాత్మికత, ప్రాణశక్తి, బ్రహ్మజ్ఞానంపై విశదమైన వివరణ ఉంది.పిప్పలాద మహర్షి జీవిత కథ మనకు అనేక సందేశాలు అందిస్తుంది. శని ప్రభావాన్ని జయించడం ద్వారా, ధైర్యం, పట్టుదల, మరియు కృతజ్ఞత అనే విలువలతో జీవించడం మనకు స్ఫూర్తి కలిగిస్తుంది. పిప్పలాదుడు ఉపనిషత్తుల రచన ద్వారా మన ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వానికి అందించారు ఆధ్యాత్మిక వేత మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం