Kalashtami: రేపే కాలాష్టమి.. ఈ పరిహారాలను పాటిస్తే శివుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండొచ్చు.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి
21 December 2024, 6:30 IST
Kalashtami: కాలాష్టమి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు కాలభైరవుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు. ఉపవాసం ఉండి ఎవరైతే కాలభైరవుడుని భక్తితో ఆరాధిస్తారో వారికి కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవడానికి అవుతుంది.
Kalashtami: రేపే కాలాష్టమి.. ఈ పరిహారాలను పాటిస్తే శివుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండొచ్చు
కాలాష్టమి నాడు కాలభైరవుడి అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి. కళాష్టమి నాడు కనుక ఇలా అనుసరించారంటే సమస్యల నుంచి గట్టెక్కి సంతోషంగా ఉండొచ్చు. కళాష్టమి విశిష్టత, కళాష్టమి సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
కాలాష్టమి వ్రతం యొక్క ప్రాముఖ్యత:
కాలాష్టమివ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు కాలభైరవుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు. ఉపవాసం ఉండి ఎవరైతే కాలభైరవుడుని భక్తితో ఆరాధిస్తారో వారికి కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవడానికి అవుతుంది.
కాలాష్టమి శుభ ముహూర్తం:
డిసెంబర్ 22న అష్టమి తిధి మధ్యాహ్నం 2:31 కి మొదలవుతుంది. సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. కనుక కళాష్టమిని డిసెంబర్ 22న జరుపుకోవాలి. కాలాష్టమి వ్రతాన్ని చేసుకోవాలి.
కాలాష్టమి నాడు ఏం చేస్తే విశేష ఫలితాలని పొందవచ్చు?
- కాలభైరవుని అనుగ్రహం కోసం కాలాష్టమి నాడు ఉపవాసం చేసి కాలభైరవుడుని భక్తితో ఆరాధిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. నిద్ర లేచి స్నానం చేసి కాలభైరవుని ఆరాధించాలి.
2. అవకాశం ఉంటే సమీపంలో ఉన్న కాలభైరవుని ఆలయానికి వెళ్లి పూజలు చేయొచ్చు.
3. కాలాష్టమి నాడు శివపురాణాన్ని చదివితే కూడా మంచిది. ఇలా చేయడం వలన కాలభైరవుని ఆశీస్సులు లభిస్తాయి.
4. ఈరోజు తోచినది ఎవరికైనా సహాయం చేయడం, దానం చేయడం కూడా మంచిదే.
5. నల్ల కుక్కకి ఆహారాన్ని పెడితే కూడా మంచి జరుగుతుంది.
6. కాలభైరవునికి ఆవాల నూనెతో దీపారాధన చేస్తే విశేష ఫలితాలని పొందవచ్చు.
కాలాష్టమి నాడు ఈ తప్పులను మాత్రం చేయకండి
- కాలాష్టమి నాడు తిట్టుకోవడం, కొట్టుకోవడం పెద్దల్ని అవమానించడం వంటివి చేయొద్దు.
2. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
3. మాంసం, మద్యంకి దూరంగా ఉంటే మంచిది.
4. ఎవరికీ హాని చేయడం, ఎవరినైనా బాధ పెట్టడం వంటివి ఈ రోజు చేయడం మంచిది కాదు.
కాలాష్టమి నాడు ఎలాంటి పరిహారాలని పాటించాలి
- కాలాష్టమి నాడు కాలభైరవుని అనుగ్రహం కలగడానికి నల్ల నువ్వులను దానం చేస్తే మంచిది.
2. శమీ చెట్టుని పూజించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
3. కాలభైరవుని మంత్రాలని జపిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. శాంతి కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.