తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Love Horoscope: ఈ వారం ఈ రాశి వారు ప్రేమలో పడతారు!మరి మీ సంగతేంటి..? ఇక్కడ తెలుసుకోవచ్చు

Weekly Love Horoscope: ఈ వారం ఈ రాశి వారు ప్రేమలో పడతారు!మరి మీ సంగతేంటి..? ఇక్కడ తెలుసుకోవచ్చు

Ramya Sri Marka HT Telugu

15 December 2024, 18:00 IST

google News
    • Weekly Love Horoscope:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం అంటే డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకూ కొన్ని రాశుల వారు ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొందరి ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకూ ఈ వారం ఏ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది తెలుసుకోండి. 
ఈ వారం ఏ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
ఈ వారం ఏ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?

ఈ వారం ఏ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?

పుట్టిన సమయాన్ని బట్టి వారి వ్యక్తిత్వాలను, లక్షణాలు మాత్రమే కాదు వ్యక్తుల జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను కూడా అంచనా వేయగలిగే శక్తి జ్యోతిష్య శాస్త్రానికి ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమకు, వివాహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ అనేది వ్యక్తుల జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిని గురించి తెలుసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. జ్యోతిష్య అంచనాల ప్రకారం డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 21 వరకు కొన్ని రాశుల వారి ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొందరి ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకూ ఈ వారం ఏ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశులవారికి జీవితంలో ఎన్నో లాభాలు, ఆర్థిక పురోగతి.. వీరిలో మీరు ఉన్నారా?

Dec 15, 2024, 05:10 PM

overthinking zodiac signs: ఈ రాశుల్లో పుట్టిన వారు అతిగా ఆలోచిస్తారట! అది వారికి మంచే చేస్తుందట!

Dec 15, 2024, 11:40 AM

ఈ రాశుల వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది- ధన లాభంతో ఆర్థిక కష్టాలు దూరం..

Dec 15, 2024, 05:33 AM

Purnima Effects: నేడే ఈ ఏడాదిలో చివరి పౌర్ణమి, ఈ రాశుల వారికి లెక్కలేనన్ని శుభాలు కలగడం ఖాయం

Dec 15, 2024, 05:00 AM

రేపటి నుంచి ఈ రాశుల వారికి ఎక్కువగా లక్.. ఆదాయం, గౌరవం పెరుగుతాయి!

Dec 14, 2024, 07:35 PM

Love Zodiac signs: ఈ రాశులు వారు ఎవరినైనా ప్రేమలో పడేస్తారు.. సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు

Dec 14, 2024, 09:13 AM

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ సంబంధాలలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. వారం ప్రారంభంలో కొంత అస్థిరత ఉంటుంది. మరో మహిళ కారణంగా మీ ప్రేమ సంబంధంలో విభేదాలు తలెత్తుతాయి. వారం చివరి భాగంలో పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ ప్రేమ జీవితంలో బిజీగా ఉంటారు.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీ ప్రేమ బంధంలో ఆనందం, సంతృప్తి ఉంటుంది. ఈ వారం మీ భాగస్వామితో మునుపెన్నడూ లేనంతగా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కొన్ని ఆహ్లాదకరమైన అనుభవాలు ఉండవచ్చు. వారాంతాలలో విహారయాత్రకు ప్లాన్ చేయవచ్చు

మిథున రాశి:

ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. వారం ఆరంభంలో కొత్త ప్రారంభాలు భావోద్వేగాలను, అశాంతిని కలిగిస్తాయి. వారం చివరిలో ఆటుపోట్లు అధికమవుతాయి. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఓపికగా ఉండటం చాలా అవసరం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. లేకపోతే ఇబ్బంది పడతారు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి వారం. స్త్రీ సహాయంతో మీ జీవితంలో ఆనందం వస్తుంది. మీ కొత్తగా ప్రేమలో పడతారు. మీ భాగస్వామితో గడపడానికి ప్లాన్ చేస్తారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటాయి. కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళాలని యోచిస్తారు. ప్రేమ పెరుగుతాయి, ఆకర్షణ పెరుగుతుంది.

సింహ రాశి:

ఈ వారికి వారం ప్రారంభంలో చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ప్రేమ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీకు మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వారం చివరిలో ప్రేమలో కొత్త ఆరంభాలు ఉంటాయి. అద్భుతమైన సమయాన్ని గడుపుతారు.

కన్య రాశి:

కన్యా రాశి వారి ప్రేమ జీవితం ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీ భాగస్వామికి మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. ప్రేమ పెరుగుతుంది. ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. వారం చివరిలో వివాహితుల మధ్య మంచి పరస్పర అవగాహన ఉంటుంది.

తులా రాశి:

తులా రాశి జాతకులకు ఈ వారం ప్రేమ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ప్రేమ భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీరు మీ ప్రేమ జీవితంపై దృష్టి పెట్టాలి. ఓపికగా, వినయంగా ఉండాలి. మీ పరస్పర సంబంధాలలో మంచి సామరస్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది.

వృశ్చిక రాశి:

ఈ వారం మీ ప్రేమ సంబంధాలు బాగుంటాయి. వారం చివరిలో కొన్ని ఆకస్మిక వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ప్రేమ విషయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రియుడు లేదా ప్రియురాలితో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో పురోగతి ఉంటుంది. మీ సంబంధంలో పరస్పర నమ్మకం, ప్రేమ పెరుగుతాయి.

ధనుస్సు రాశి :

ఈ వారం మీకు ప్రేమకు సంబంధించిన ఆందోళనలు, సమస్యలు అధికంగా ఉంటాయి. కొత్త ప్రారంభాలు ఆందోళన కలిగిస్తాయి. మీరు ఒంటరిగా ఫీలవుతారు. అయితే వారం చివరి భాగంలో పరిస్థితి మెరుగుపడుతుంది. మీ రిలేషన్ షిప్ లో ప్రేమ పెరుగుతుంది. వారాంతంలో మీ పరస్పర సంబంధంలో ఆనందం, ప్రేమ పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళాలని యోచిస్తారు.

మకర రాశి:

మకర రాశి వారికి ఈవారం ప్రేమ పరంగా సంతోషంగా ఉంటుంది. మీ సంబంధం బలంగా, సంతోషంగా ఉంటుంది.స్నేహితుడి సహాయంతో మీ ప్రేమ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. అయితే వారాంతంలో కొన్ని వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ సంబంధంలో మూడవ వ్యక్తిని చేర్చుకోకపోవడం మంచిది. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి.

కుంభ రాశి:

ఈ రాశి వారికి రాశి జీవితం పట్ల ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది. అలాంటి వ్యక్తుల పట్ట ఆకర్షితులవుతారు. బంధంలో మరింత లోతుగా వెళ్లడానికి ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి సమయం కేటాయించండి. మీరు మీ భాగస్వామితో విషయాలను బహిరంగంగా పంచుకున్నప్పుడు మాత్రమే కొత్త సంబంధం బలపడుతుంది. బాగుంటుంది.

మీన రాశి:

మీన రాశి వారు ఈ వారం లోతైన సంభాషణలలో పాల్గొంటారు. మీ భావాలను మీ భాగస్వామికి నిర్మొహమాటంగా తెలియజేయండి. కొత్త వాటిని స్వీకరించండి. అయితే బంధాలు బలంగా ఉండటానికి నమ్మకం, అవగహన ప్రేమ అవసరమన్న సంగతి మర్చిపోకండి. వాటి అనుగుణంగానే భాగస్వామిని ఎంచుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం