తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారు ఆనందోత్సాహాలతో ఉంటారు!

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారు ఆనందోత్సాహాలతో ఉంటారు!

HT Telugu Desk HT Telugu

21 May 2023, 1:00 IST

    • Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మే 21, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Today's Horoscope
Today's Horoscope (Unsplash)

Today's Horoscope

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము) 21.05.2023

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: వైశాఖము వారం: ఆదివారం, తిథి: శు. విదియ నక్షత్రం : రోహిణి

మేష రాశి :

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. వాదనలకు దూరంగా ఉండండి. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువుల మరియు వాక్ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనులుయందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని తెలియచేస్తున్నాను.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. కుటుంబ సభ్యులతో వాదనకు దూరంగా ఉండాలి. పనులయందు ఆలస్యము అలసట ఏర్పడును. విశ్రాంతి కోసం ప్రయత్నించెదరు. వృషభ రాశివారు ఆదివారం రోజు నవగ్రాహాలకు అధిపతి అయినటువంటి సూర్యుణ్ణి ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి :

మిథునరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఆనందోత్సాహాలతో ఉంటారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఖర్చులు అధికమగు సూచన. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి జన్మరాశి యందు శు క్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశివారికి కలసివచ్చును. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశివారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ధన వ్యయము అధికముగా ఉండును. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహ రాశి :

సింహరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. సింహరాశివారు వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. విశ్రాంతి కోసం ప్రయత్నం చేయాలని సూచన. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. నూతన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్య రాశి :

కన్యారాశివారికి ఈరోజు అనుకూలముగా ఉన్నది. ప్రయాణములు కలసివచ్చును. ఖర్చులు అధికముగా ఉండును. నూతనముగా వస్తువులు కొనడానికి ప్రయత్నం చేసెదరు. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. కన్యారాశివారు మరింత శు భఫలితాలు పొందాలనుకుంటే ఈరోజు సూర్యాష్టకాన్ని పఠించలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో చర్చలకు వాగ్వివివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ఖర్చులు నియంత్రించుకోవాలి. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. ప్రయాణములు అధికముగా ఉండును. చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విశ్రాంతి కోసం ప్రయత్నించాలి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి :

ధనూరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణాలు అనుకూలించును. ధనాన్ని అవసరార్థం ఖర్చు చేసెదరు. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి :

మకర రాశివారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ఖర్చులు అధికమగును. నూతన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఆరోగ్య విషయంలో మార్పు కలుగును. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమస్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి :

కుంభరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబములో కలతలు వేధించును. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ధనవ్యయం అధికముగా ఉండును. ప్రయాణములు అనుకూలించును. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. మానసిక ఒత్తిళ్ళు కలుగు సూచన. కుంభరాశి వారికి మరింత శు భఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి :

మీనరాశి వారికి ఈ రోజు మథ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో వాగ్వివివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు చేయడానికి ఇవ్వడానికి కూడా అనుకూలంగా లేనటువంటి సమయము. ముఖ్యమైన వస్తువులకోసం ఖర్చు చేయు సూచన. మీనరాశి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ