తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అనంత చతుర్దశి అంటే ఏమిటి? ఆరోజు ఏమి చేయాలి?

అనంత చతుర్దశి అంటే ఏమిటి? ఆరోజు ఏమి చేయాలి?

HT Telugu Desk HT Telugu

25 September 2023, 11:53 IST

    • జ్యోతిష్యశాస్త్ర ప్రకారం భాద్రపదమాసం శుక్ల పక్ష చతుర్దశి తిథిని అనంత చతుర్దశిగా, అనంత పద్మనాభ వ్రతంగా చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీకృష్ణ భగవానుడు
శ్రీకృష్ణ భగవానుడు (pixabay)

శ్రీకృష్ణ భగవానుడు

చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్‌ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 28 సెప్టెంబర్‌ 2023 గురువారం రోజు భాద్రపదమాసం శుక్ల పక్ష చతుర్దశి అనంత చతుర్దశి వచ్చినట్లుగా పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు అనంత పద్మనాభ వ్రతం ఆచరించినవారికి సకల శుభాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారతం తెలిపినదని చిలకమర్తి తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి ఓ జగద్రక్షకా! మేం అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పాలని ప్రార్ధించగా అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు.

ధర్మరాజు వెంటనే అనంతుడు ఎవరని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆ అనంతుడు అంటే ఎవరో కాదు... ఆ కాలపురుషుడిని నేనే. కాలమే అనంతుడు అని పరమాత్మ బదులిస్తాడు. 

అనంత పద్మనాభ వ్రత కథ

అనంత పద్మనాభ వ్రత కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు. కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు శీల అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యముతో మరణించగా సుమంతుడు వేరొక స్త్రీని వివాహమాడెను. ఇలా ఉండగా రూపలావణ్యవతియైన శీలను కౌండిన్యుడు వివాహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడుతాడు.

అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగెను. ఇంతలో శీల ఆ సమీప నదీ తీరమందు కొందరు పూజలు చేస్తుండగా వారి వద్దకు చేరి ఆ పూజ గురించి అడుతుంది. వారు అనంత పద్మనాభ వ్రతం గురించి చెబుతారు. ఈ రోజు కనుక విధి విధానంగా ఆ నారాయణుని ఆరాధించి, ఆ ఆరాధనలో ఉంచిన పదునాలుగు ముళ్ళు కలిగిన పట్టుత్రాడు తోరం భర్త భార్య ఎడమ చేతికి, భార్య భర్త కుడిచేతికి కట్టుకుని ధరించిన యెడల అష్ట ఐశ్వర్యాలు, సుఖాలు లభిస్తాయని చెబుతారు. వారు ఇచ్చిన తోరము ధరించి కౌండిన్య మహర్షి వద్దకు రాగానే, మహర్షి ఆమె చేతిని ఉన్న తోరమును చూచి మిక్కిలి ఆగ్రహించి నన్ను వశీకరించుకొనుటకై ఈ తోరం కట్టుకున్నావా అంటూ దానిని తెంచి నిప్పులవైపు విసిరేస్తాడు. శీల ఆ తోరము పాలలో వేసి భద్రపరుస్తుంది.

ఆ క్షణము నుండే కౌండిన్యుడు సకల సంపదలను కోల్పోతాడు. తిరిగి పశ్చాత్తాప మనస్కుడై దీనికి మార్గమేమి? అని భార్యని అడిగి తెలుసుకుని అనంతుని సంతోషపెట్టుటకై అరణ్యమున కేగి తపమాచరిస్తాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగానే స్తోత్రము చేసి సాగిలపడతాడు. అనంతుడు అనుగ్రహించి, నీ గృహమునకేగి పిదప పదునాలుగు సంవత్సరములు అనంత చతుర్దశీ వ్రతమాచరించాలని సూచిస్తాడు. ఆ రోజు ధరించిన తోరము సకల శుభములను చేకూర్చుచూ అప్టైశ్వర్యములు ప్రసాదించును అని అనుగ్రహించెను. అట్టి అనంత పద్మనాభ చతుర్దశి వ్రతమాచరించి సర్వులమూ పునీతులమౌదామని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం