తెలుగు న్యూస్  /  ఫోటో  /  What Is Ghosting । బ్రేకప్ కంటే ఘోరమైనది ఘోస్టింగ్.. దీని అర్థం తెలుసుకోండి!

What is Ghosting । బ్రేకప్ కంటే ఘోరమైనది ఘోస్టింగ్.. దీని అర్థం తెలుసుకోండి!

02 February 2023, 16:04 IST

What is Ghosting: బ్రేకప్ కంటే ఘోరమైనది ఘోస్టింగ్. అసలు ఘోస్టింగ్ అంటే ఏమిటి? దీనికి బంధాలకు మధ్య సంబంధం ఏమిటి ఇక్కడ చూడండి.

  • What is Ghosting: బ్రేకప్ కంటే ఘోరమైనది ఘోస్టింగ్. అసలు ఘోస్టింగ్ అంటే ఏమిటి? దీనికి బంధాలకు మధ్య సంబంధం ఏమిటి ఇక్కడ చూడండి.
ఘోస్టింగ్ అనేది ఈ కాలంలో ఒక ట్రెండింగ్ టాపిక్.  ఘోస్టింగ్ అంటే 'మనస్సులోని దెయ్యం' అనే అర్థాన్ని నిర్వచిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కొంతకాలం పాటు సంబంధంలో ఉండి, అందులో ఒకరు అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడం, కారణం కూడా చెప్పకపోవడం ఘోస్టింగ్ అని అంటున్నారు. ఇది బ్రేకప్ కంటే చాలా బాధాకరమైన పరిస్థితిగా వర్ణిస్తున్నారు. 
(1 / 7)

కొంతమంది తమ భాగస్వామికి చెప్పాపెట్టకుండా నిష్క్రమిస్తారు, ఇంతకాలం నుంచి కొనసాగిన వారి బంధం నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతారు. దీనికి కారణం ఏమిటో అవతలి వారికి కూడా తెలియజేయరు. ఇది వారిని ప్రశ్నల ఊబిలోకి నెట్టెస్తుంది. ఈ రకంగా ఒకరి నుంచి విడిపోవడాన్ని ఘోస్టింగ్ అంటారు. 
(2 / 7)

ఇద్దరు ప్రేమికులు కొన్ని కారణాలతో విడిపోతే అది బ్రేకప్, భార్యాభర్తలు కొన్ని కారణాలతో విడిపోతే అది విడాకులు. అయితే ఎలాంటి కారణాలు చెప్పకుండా మౌనంగా తమ ఆత్మీయులను దూరం చేసుకునే వారు ఉంటారు. వారు చేసిన ఈ దగాను ఘోస్టింగ్ అంటారు. ఇందులో వారు తమ స్నేహితులతో, తల్లిదండ్రులతో ఎవరితో అయినా ఘోస్టింగ్ చేయవచ్చు. 
(3 / 7)

  అఫీషియల్ ఘోస్టింగ్ - కొంతమంది ఉద్యోగులు చెప్పకుండా వేరే ఉద్యోగం చూసుకుంటారు. వారు రాజీనామా పంపరు, పాత సంస్థనుంచి వచ్చే ఈ-మెయిల్స్, కాల్స్ కు స్పందించరు. దీనిని అఫీషియల్ ఘోస్టింగ్ అంటారు. 
(4 / 7)

ప్రతీ సమస్యకు ఒక కారణం ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఈ రకంగా 'ఘోస్టింగ్' చేయడానికి, చెప్పకుండా దూరం అవ్వడానికి కారణం వారిలోని భయాలు, అపరాధభావన, కుంగుబాటు, మోసపోయామనే బాధ, సంఘర్షణ వంటివి కారణం కావొచ్చునని మనస్థత్వ నిపుణులు అంటున్నారు. 
(5 / 7)

 ఇంకా, ఆ వ్యక్తులపై అటాచ్మెంట్ కోల్పోవడం, వారిపై పూర్తి నిరాసక్తి, రుణం లేదా వడ్డీని ఎగ్గొట్టడం, మనసు విరిగిపోవటం, బాధాకరమైన వాగ్విదాలు వంటి కారణాలు కూడా వ్యక్తులను మౌనంగా నిష్క్రమించేలా చేస్తాయి. 
(6 / 7)

ఘోస్టింగ్ చేయకూడదంటే వాస్తవికతను అంగీకరించాలి, లోలోపల ఏదీ ఉంచుకోకూడదు, కమ్యూనికేషన్ జరగాలి. లేదంటే వ్యక్తులు  మౌనంగానే దూరం అవ్వొచ్చు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి