తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Body Odor : ఒంటి నుంచి దుర్వాసన వస్తుందా? ఇలా ఫ్రెష్​గా ఉండండి..

Body Odor : ఒంటి నుంచి దుర్వాసన వస్తుందా? ఇలా ఫ్రెష్​గా ఉండండి..

08 June 2022, 9:25 IST

సమ్మర్​ వేడి వల్ల చెమట వస్తుంది. ఇది శరీరం నుంచి దుర్వాసనను విడుదల చేస్తుంది. పైగా చెమట చికాకుని కూడా రప్పిస్తుంది. అయితే ఈ దుర్వాసనను వదిలించుకోవడానికి శుభ్రంగా స్నానం చేయడం ఒక్కటే పరిష్కారం కాదు.. మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరమని అంటున్నారు చర్మ నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • సమ్మర్​ వేడి వల్ల చెమట వస్తుంది. ఇది శరీరం నుంచి దుర్వాసనను విడుదల చేస్తుంది. పైగా చెమట చికాకుని కూడా రప్పిస్తుంది. అయితే ఈ దుర్వాసనను వదిలించుకోవడానికి శుభ్రంగా స్నానం చేయడం ఒక్కటే పరిష్కారం కాదు.. మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరమని అంటున్నారు చర్మ నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
వేడి వాతావరణంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య శరీర దుర్వాసన. చెమట ఎక్కువగా పట్టేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే చర్మం వాసన ఎక్కువగా ఉంటే చుట్టుపక్కల వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి చాలా వరకు విముక్తి  పొందవచ్చు.
(1 / 5)

వేపలోని ఔషధ గుణాలు అందరికీ తెలిసిందే. గుప్పెడు వేప ఆకులను నీటితో కలిపి పేస్ట్ చేయండి. దానిని శరీరంలోని వివిధ మడతలపై, మెడ వద్ద అప్లై చేసి.. 15 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత నీళ్లతో కడిగి స్నానం చేయాలి.
(2 / 5)

తలస్నానం చేసిన తర్వాత దూదితో కొద్దిగా కొబ్బరినూనెను చంకలలో రాసుకోవాలి. ఇది మంచి వాసన ఇస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 
(3 / 5)

నిమ్మరసం తీసుకుని అందులో సమానమైన నీరు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు దూదితో శరీరంపై అప్లై చేయాలి. దాదాపు 5 నుంచి 6 నిమిషాల పాటు అలాగే ఉంచి స్నానం చేయాలి. నిమ్మరసం క్రిములను చంపడంలో ఎంతగానో సహకరిస్తుంది. అంతే కాకుండా చంకలలోని నలుపు రంగును పోగొడుతుంది. 
(4 / 5)

తగినంత నీరు తాగాలి. నీరు మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది క్రిములను కూడా శుభ్రపరుస్తుంది. ఫలితంగా శరీర దుర్వాసన బలమైన వాసనను ఉత్పత్తి చేయదు. నీరు మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి