తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top Four Nbfc Fixed Deposits With Aaa Rating That Offer Up To 7.95 Percent Interest Rate

Top NBFC fixed deposits: 7.95 శాతం వరకు వడ్డీ ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీలు ఇవే

13 January 2023, 15:04 IST

Top NBFC fixed deposits: ఘనమైన చరిత్ర ఉన్న నాలుగు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తున్నాయి.

ప్రముఖ కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటి బజాజ్ ఫైనాన్స్. ఇది AAA రేటెడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. 44 నెలల కాలవ్యవధి డిపాజిట్లపై 7.95 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాకుండా, డిపాజిటర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాన్ని కూడా పొందవచ్చు.
(1 / 4)

HDFC లిమిటెడ్ (హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) కూడా దాదాపు 28 సంవత్సరాలుగా AAA రేటింగ్ కలిగి ఉన్న సంస్థ. ఇటీవల తన 45వ వార్షికోత్సవం సందర్భంగా HDFC 45 నెలల కాలవ్యవధితో కూడిన సఫైర్ డిపాజిట్ అనే కొత్త స్కీమ్ ప్రారంభించింది. వార్షిక, సంచిత ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు సంవత్సరానికి 7.60 శాతం, సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 7.10 నుండి 7.85 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
(2 / 4)

సుందరం ఫైనాన్స్ 30 సంవత్సరాలుగా AAA రేటెడ్ కలిగిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC)గా ఉంది. AAA రేటింగ్ అత్యధిక క్రెడిట్-నాణ్యతను సూచిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీ సాధారణ ప్రజలకు 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు 7.20 నుండి 7.50 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతాన్ని అందిస్తుంది, 
(3 / 4)

మహీంద్రా ఫైనాన్స్ కూడా AAA రేటెడ్ NBFC. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ధన్‌వృద్ధి కింద 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల కాలవ్యవధిలో సాధారణ ప్రజలకు సంవత్సరానికి 6.75 నుండి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.00 నుండి 7.75 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తుంది. (గమనిక: అన్ని వడ్డీ రేట్లు అధికారిక వెబ్‌సైట్‌ల నుండి 13 జనవరి 2023 నాటికి వర్తించేవిగా తీసుకున్నవి)
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి