తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /   Exam Preparation Tips । పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఈ చిట్కాలు పాటించండి!

Exam Preparation Tips । పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఈ చిట్కాలు పాటించండి!

14 December 2022, 23:24 IST

Exam Preparation Tips: బోర్డ్ ఎగ్జామ్స్ కోసం సమయం తక్కువగా ఉంటే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నిపుణులు ఇచ్చిన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

Exam Preparation Tips: బోర్డ్ ఎగ్జామ్స్ కోసం సమయం తక్కువగా ఉంటే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నిపుణులు ఇచ్చిన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
విద్యార్థులు పరీక్షల వేళ ఒత్తిడిని ఎదుర్కొంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ కోసం సమయం తక్కువగా ఉంటే ఒత్తిడి మరింత ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఎల్లెనాబాద్‌లోని సట్‌లుజ్ పబ్లిక్ స్కూల్‌లో మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ రాణి గోయెల్ HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని చిట్కాలను పంచుకున్నారు. 
(1 / 8)
విద్యార్థులు పరీక్షల వేళ ఒత్తిడిని ఎదుర్కొంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ కోసం సమయం తక్కువగా ఉంటే ఒత్తిడి మరింత ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఎల్లెనాబాద్‌లోని సట్‌లుజ్ పబ్లిక్ స్కూల్‌లో మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ రాణి గోయెల్ HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని చిట్కాలను పంచుకున్నారు. (Photo by Firmbee.com on Unsplash)
షెడ్యూల్‌కు కట్టుబడండి: టైమ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోండి, విద్యార్థులు తమ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలి, లక్ష్యాలను నెరవేర్చుకోవాలి,  వాయిదా వేయకుండా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సమానమైన ప్రిపరేషన్ సమయం ఉండేలా చూసుకోవాలి. 
(2 / 8)
షెడ్యూల్‌కు కట్టుబడండి: టైమ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోండి, విద్యార్థులు తమ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలి, లక్ష్యాలను నెరవేర్చుకోవాలి,  వాయిదా వేయకుండా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సమానమైన ప్రిపరేషన్ సమయం ఉండేలా చూసుకోవాలి. (File Photo)
కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యత - విద్యార్థులు పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యతనివ్వాలి. కఠినమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, సులభమైన సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించుకోవాలి. డౌట్స్ అన్నింటిని ముందుగానే క్లియర్ చేసుకోవాలి. 
(3 / 8)
కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యత - విద్యార్థులు పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యతనివ్వాలి. కఠినమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, సులభమైన సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించుకోవాలి. డౌట్స్ అన్నింటిని ముందుగానే క్లియర్ చేసుకోవాలి. (Shutterstock/ Representative)
 స్వీయ-మూల్యాంకనం: పరీక్షల కంటే ముందు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు మీరే పరీక్ష పెట్టుకోండి.  మాక్ పరీక్షలు తరచుగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి వారి స్వంత బలాలు,  లోపాలను గుర్తించడంలో సహాయపడతాయి.
(4 / 8)
 స్వీయ-మూల్యాంకనం: పరీక్షల కంటే ముందు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు మీరే పరీక్ష పెట్టుకోండి.  మాక్ పరీక్షలు తరచుగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి వారి స్వంత బలాలు,  లోపాలను గుర్తించడంలో సహాయపడతాయి.(Getty Images/iStockphoto)
శారీరక- మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు: ఒత్తిడిని అధిగమించడానికి కాసేపు చదువును పక్కనబెట్టి క్రీడలు ఆడాలి లేదా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించడానికి, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, సంగీతం,  నడకలు లేదా తేలికపాటి వ్యాయామాలు, ఉల్లాసంగా ఉండటం,  ధ్యానం చేయడం వంటివి ప్రాక్టీస్ చేయండి.
(5 / 8)
శారీరక- మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు: ఒత్తిడిని అధిగమించడానికి కాసేపు చదువును పక్కనబెట్టి క్రీడలు ఆడాలి లేదా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించడానికి, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, సంగీతం,  నడకలు లేదా తేలికపాటి వ్యాయామాలు, ఉల్లాసంగా ఉండటం,  ధ్యానం చేయడం వంటివి ప్రాక్టీస్ చేయండి.(HT FILE PHOTO)
మునుపటి సంవత్సరాల పేపర్లు - మాక్ టెస్టులు, మునుపటి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు అన్నీ పరిశీలించాలి. ఇది ఏ అధ్యాయలపై ఫోకస్ పెట్టాలో అవగాహన అందిస్తుంది. 
(6 / 8)
మునుపటి సంవత్సరాల పేపర్లు - మాక్ టెస్టులు, మునుపటి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు అన్నీ పరిశీలించాలి. ఇది ఏ అధ్యాయలపై ఫోకస్ పెట్టాలో అవగాహన అందిస్తుంది. (Hindustan Times)
అభ్యాస వాతావరణం: బోర్డ్ ఎగ్జామ్స్‌లో సరిగ్గా సమాధానాలు రాయడానికి ప్రిపరేషన్ బలంగా ఉండాలి. ఇందుకోసం మంచి అభ్యాస వాతావరణం ఎంచుకోవాలి. 
(7 / 8)
అభ్యాస వాతావరణం: బోర్డ్ ఎగ్జామ్స్‌లో సరిగ్గా సమాధానాలు రాయడానికి ప్రిపరేషన్ బలంగా ఉండాలి. ఇందుకోసం మంచి అభ్యాస వాతావరణం ఎంచుకోవాలి. (Ravi Choudhary/HT PHOTO)
భయాన్ని వీడాలి: అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, తక్కువ గ్రేడ్‌లు అందుకుంటామనే భయం ఉండకూడదు. ఫలితాలపై ఆలోచించకుండా చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి.
(8 / 8)
భయాన్ని వీడాలి: అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, తక్కువ గ్రేడ్‌లు అందుకుంటామనే భయం ఉండకూడదు. ఫలితాలపై ఆలోచించకుండా చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి