తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Are The Foreign Cricketers Who Married Indian Girls

Foreign Cricketers Married Indian Girls: ఈ విదేశీ క్రికెటర్లు.. మన దేశపు అల్లుళ్లు..!

17 March 2023, 14:59 IST

Foreign Cricketers Married Indian Girls: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్.. మన దేశంలో ఈ ఆటకున్నంత క్రేజ్ మరో దేశంలో లేదనే చెప్పాలి. క్రికెటర్లను అభిమానించడమే కాదు ఆరాధిస్తుంటారు కూడా. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఏ క్రికెటరైన భారత్‌కు రావాలని, ఇక్కడ ఆతిథ్యం పొందాలని చూస్తుంటారు. ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా.. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా అప్పుడప్పుడు భారత్‌తో సంబంధం కలిగి ఉండటం కాకుండా.. శాశ్వతంగా మన దేశంతో సంబంధం, ఆతిథ్యం అందుకున్న క్రికెటర్లు కొంతమంది ఉన్నారు. అదేనండి మన అమ్మాయిలను వివాహం చేసుకుని భారత్‌కు అల్లుళ్లుగా మారిపోయి మన దేశానికి శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. మరి ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Foreign Cricketers Married Indian Girls: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్.. మన దేశంలో ఈ ఆటకున్నంత క్రేజ్ మరో దేశంలో లేదనే చెప్పాలి. క్రికెటర్లను అభిమానించడమే కాదు ఆరాధిస్తుంటారు కూడా. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఏ క్రికెటరైన భారత్‌కు రావాలని, ఇక్కడ ఆతిథ్యం పొందాలని చూస్తుంటారు. ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా.. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా అప్పుడప్పుడు భారత్‌తో సంబంధం కలిగి ఉండటం కాకుండా.. శాశ్వతంగా మన దేశంతో సంబంధం, ఆతిథ్యం అందుకున్న క్రికెటర్లు కొంతమంది ఉన్నారు. అదేనండి మన అమ్మాయిలను వివాహం చేసుకుని భారత్‌కు అల్లుళ్లుగా మారిపోయి మన దేశానికి శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. మరి ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నుంచి శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ వరకు చాలా మంది మన దేశపు అల్లుళ్లే.
(1 / 6)
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నుంచి శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ వరకు చాలా మంది మన దేశపు అల్లుళ్లే.(photos - social media)
 పాకిస్థాన్‌కు ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ 2019లో భారత్‌కు చెందిన సమీయా అర్షును వివాహం చేసుకున్నాడు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అర్షు ఏరోనాటికల్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది.
(2 / 6)
 పాకిస్థాన్‌కు ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ 2019లో భారత్‌కు చెందిన సమీయా అర్షును వివాహం చేసుకున్నాడు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అర్షు ఏరోనాటికల్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది.
శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 2005లో తమిళనాడుకు చెందిన మతిమలర్‌ను వివాహం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‍‌లో 800 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన మురళీకి ఓ కుమారుడు, ఓ కుమార్తే ఉన్నారు.
(3 / 6)

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్.. భారత్‌కు చెందిన మషూమ్ సింఘాను వివాహం చేసుకున్నాడు. 2010 ఐపీఎల్‌లో మషూమ్‌ను కలిసిన షాన్.. ఆమెతో కొన్నెళ్ల పాటు ప్రేమలో ఉన్నాడు. అనంతరం 2014లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. మషూమ్ సింఘా మోడలే కాకుండా ఓ వ్యాపారవేత్త కూడా. 2001లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్‌ను గెల్చుకుంది. 
(4 / 6)

మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2022లో భారత్‌కు చెందిన వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌ను క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2020లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. 
(5 / 6)

షోయబ్ మాలిక్-సానియా మీర్జా ప్రపంచంలోనే అత్యంత పాపులర్ జంట. పాక్ క్రికెటర్ షోయబ్.. భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జాను 2008లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
(6 / 6)
షోయబ్ మాలిక్-సానియా మీర్జా ప్రపంచంలోనే అత్యంత పాపులర్ జంట. పాక్ క్రికెటర్ షోయబ్.. భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జాను 2008లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

    ఆర్టికల్ షేర్ చేయండి