తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Republic Day 2023 Parade: ‘గణతంత్ర’ పరేడ్‍లో శకటాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం

Republic Day 2023 Parade: ‘గణతంత్ర’ పరేడ్‍లో శకటాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం

26 January 2023, 14:10 IST

74th Republic Day Parade: ఢిల్లీలోని కర్తవ్యపథ్‍పై గణతంత్ర దినోత్సవ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ పరేడ్‍లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శనకు వచ్చాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా పరేడ్‍లో ఆకట్టుకున్న వాటిలో కొన్నింటి వివరాలు..

  • 74th Republic Day Parade: ఢిల్లీలోని కర్తవ్యపథ్‍పై గణతంత్ర దినోత్సవ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ పరేడ్‍లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శనకు వచ్చాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా పరేడ్‍లో ఆకట్టుకున్న వాటిలో కొన్నింటి వివరాలు..
మకర సంక్రాంతి సమయంలో కోనసీమలో జరిగే 'ప్రభల తీర్థం' వేడుకను ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ శకటం రూపొందింది. కర్తవ్యపథ్‍పై జరిగిన పరేడ్‍లో ఇది ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది.
(1 / 8)
మకర సంక్రాంతి సమయంలో కోనసీమలో జరిగే 'ప్రభల తీర్థం' వేడుకను ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ శకటం రూపొందింది. కర్తవ్యపథ్‍పై జరిగిన పరేడ్‍లో ఇది ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది.(ANI)
గిరిజన పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా, ప్రముఖ వైద్యనాథ్ ఆలయం, సొహారై పెయింటింగ్‍లతో కూడిన శకటాన్ని జార్ఘంజ్ ప్రదర్శించింది. 
(2 / 8)
గిరిజన పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా, ప్రముఖ వైద్యనాథ్ ఆలయం, సొహారై పెయింటింగ్‍లతో కూడిన శకటాన్ని జార్ఘంజ్ ప్రదర్శించింది. (ANI)
అహోం దిగ్గజ యోధుడు జనరల్ లచిత్ బోడ్‍పుకాన్, కామఖ్యా దేవాలయంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అసోం శకతం తయారైంది. 
(3 / 8)
అహోం దిగ్గజ యోధుడు జనరల్ లచిత్ బోడ్‍పుకాన్, కామఖ్యా దేవాలయంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అసోం శకతం తయారైంది. (ANI)
మహిళా శక్తికి ప్రతీకగా శకటాన్ని త్రిపుర ప్రదర్శించింది. పర్యాటకం, సేంద్రియ వ్యవసాయం గురించి శకటంలో వివరించింది.
(4 / 8)
మహిళా శక్తికి ప్రతీకగా శకటాన్ని త్రిపుర ప్రదర్శించింది. పర్యాటకం, సేంద్రియ వ్యవసాయం గురించి శకటంలో వివరించింది.(ANI)
నయా జమ్మూకశ్మీర్, ప్రసిద్ద అమర్నాథ్ ఆలయం ప్రధాన థీమ్‍లుగా జమ్ము కశ్మీర్ శకటం తయారైంది. 
(5 / 8)
నయా జమ్మూకశ్మీర్, ప్రసిద్ద అమర్నాథ్ ఆలయం ప్రధాన థీమ్‍లుగా జమ్ము కశ్మీర్ శకటం తయారైంది. (ANI)
కార్బెట్ నేషనల్ పార్క్, అల్మోరా జగద్వీశర్ థామ్‍ను ప్రతిబింబిస్తూ ఉత్తరాఖండ్ శకటం పరేడ్‍లో ప్రదర్శనకు వచ్చింది.
(6 / 8)
కార్బెట్ నేషనల్ పార్క్, అల్మోరా జగద్వీశర్ థామ్‍ను ప్రతిబింబిస్తూ ఉత్తరాఖండ్ శకటం పరేడ్‍లో ప్రదర్శనకు వచ్చింది.(ANI)
ఆ ప్రాంత విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లుకు కట్టింది లద్ధాఖ్ శకటం. 
(7 / 8)
ఆ ప్రాంత విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లుకు కట్టింది లద్ధాఖ్ శకటం. (ANI)
పర్యాటకం ప్రధాన థీమ్‍గా అరుణాచల్ ప్రదేశ్‍కు చెందిన శకటం.. కర్తవ్యపథ్‍పై జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‍కు వచ్చింది.  
(8 / 8)
పర్యాటకం ప్రధాన థీమ్‍గా అరుణాచల్ ప్రదేశ్‍కు చెందిన శకటం.. కర్తవ్యపథ్‍పై జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‍కు వచ్చింది.  (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి