తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sri Padmavathi Ammavari Teppotsavam At Thiruchanur 2023

Teppotsavam at Thiruchanur : తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం

03 June 2023, 7:40 IST

Sri Padmavathi Ammavari Teppotsavam 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మే 31వ తేదీ జరుగుతున్న ఈ తెప్పోత్సవాలు… జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

  • Sri Padmavathi Ammavari Teppotsavam 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మే 31వ తేదీ జరుగుతున్న ఈ తెప్పోత్సవాలు… జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
(1 / 5)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.(facebook)
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. 
(2 / 5)
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. 
మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
(3 / 5)
మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.(facebook)
సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించారు.
(4 / 5)

అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. అమ్మవారికి జూన్ 3వ తేదీన రాత్రి 8 గంటలకు గజవాహనం, జూన్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి