తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Relationship Tips । అత్తాకోడళ్ల మధ్య బంధం బాగుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి!

Relationship Tips । అత్తాకోడళ్ల మధ్య బంధం బాగుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి!

01 January 2023, 17:58 IST

Relationship Tips: మన సమాజంలో ఎవరితో బంధం ఎలా ఉన్నప్పటికీ, అత్తాకోడళ్ల మధ్య బంధం ఎంతో ప్రత్యేకమైనది. వీరి బంధం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో అందరూ ప్రశాంతగా ఉండగలుగుతారు.

  • Relationship Tips: మన సమాజంలో ఎవరితో బంధం ఎలా ఉన్నప్పటికీ, అత్తాకోడళ్ల మధ్య బంధం ఎంతో ప్రత్యేకమైనది. వీరి బంధం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో అందరూ ప్రశాంతగా ఉండగలుగుతారు.
అత్తాకోడళ్ల బంధం గంభీరమైనది. కొంచెం ఇష్టం, కొంచె కష్టం అనేలా ఉంటాయి. అత్తగారితో ఎంత ఓపెన్‌గా ఉన్నా కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఈ విషయాలు ఏమిటో తెలుసుకోండి.
(1 / 7)

కొన్నిసార్లు అత్తాకోడళ్ల పొట్లాట పందెం కోళ్ల మధ్య జరిగే పోరులా ఉంటుంది. వీరి మధ్య పోరులో మగవారే నలిగిపోయేది. ఇటు భార్యవైపు నుంచి అటు అమ్మ వైపు నుంచి వచ్చే ఒత్తిడితో ఆ మగవాడి బతుకు చిత్తవుతుంది. 
(2 / 7)

కోడలు తన అత్తగారితో మాట్లాడేటపుడు తన కొడుకుని తనకంటే బాగా చూసుకుంటున్నట్లుగా చెప్పకూడదు. ఇలాంటపుడు కొడుకు విషయంలో తల్లి మానసిక ఒత్తిడికి గురవుతుంది. అది గొడవలకు దారితీస్తుంది.   
(3 / 7)

అత్తగారు అందించే బహుమతులను ఆనందంగా స్వీకరించాలి గానీ, వంకలు పెట్టకూడదు . 
(4 / 7)

  మీకు వారి వంట నచ్చకపోవచ్చు, కానీ ఆ వంటను మెచ్చుకోకాపోగా, వేరేలా చేయాలని ఎప్పుడూ చెప్పకండి, తన కొడుకు ఎలా తింటాడో తల్లికి తెలుసు కాబట్టి, వంటలో లోపాలు వెతకవద్దు. 
(5 / 7)

ఎవరికైనా వారి తల్లిదండ్రులు అంటేనే ఇష్టం ఉంటుంది. మీ అత్తామామల వ్యవహారశైలిని మీ తల్లిదండ్రులతో పోల్చుకోకూడదు. కోడలు వారి పుట్టింటి గొప్పలను అత్తవారింట్లో చెప్పకపోవడమే ఉత్తమం. 
(6 / 7)

మీ భర్తతో మీ సాన్నిహిత్యం గురించి, వారి లోపాల గురించి మీ అత్తగారితో ఎప్పుడూ చర్చించకండి. అది వారికి, మీ భర్తకు బాధ కలిగించవచ్చు,
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి