తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Relationship Advice, Factors That Ruin Relationship

Relationship Advice: చిన్న అంశాలే పెద్ద పెద్ద గొడవలకు కారణం కావొచ్చు, జాగ్రత్త!

12 May 2023, 13:59 IST

Relationship Advice: భార్యాభర్తల మధ్య గొడవలు జరగటానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే మనస్తత్వ నిపుణుల ప్రకారం చిన్న కారణాలకే అతిగా స్పందించడం వల్ల గొడవలు జరుగుతాయి. వీటిని గుర్తించడం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు.

Relationship Advice: భార్యాభర్తల మధ్య గొడవలు జరగటానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే మనస్తత్వ నిపుణుల ప్రకారం చిన్న కారణాలకే అతిగా స్పందించడం వల్ల గొడవలు జరుగుతాయి. వీటిని గుర్తించడం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు.
కాసేపు ఒంటరిగా ఉండటం: సమస్య ఉన్నప్పుడు భాగస్వామి ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ సమయంలో కొన్ని రోజులు మాట్లాడటం మానేయండి. దీంతో రిలేషన్ షిప్ లో గ్యాప్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండటంలో తప్పేమీ లేదు. 
(1 / 5)
కాసేపు ఒంటరిగా ఉండటం: సమస్య ఉన్నప్పుడు భాగస్వామి ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ సమయంలో కొన్ని రోజులు మాట్లాడటం మానేయండి. దీంతో రిలేషన్ షిప్ లో గ్యాప్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండటంలో తప్పేమీ లేదు. (Freepik)
మరొకరితో చనువు: ఒకరితో సంబంధంలో ఉన్నప్పుడు మరొక వ్యక్తిని ఇష్టపడటం లేదా చనువుగా ఉన్నట్లు కనిపించడం మీ మధ్య అపార్థాలను సృష్టిస్తుంది. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 
(2 / 5)
మరొకరితో చనువు: ఒకరితో సంబంధంలో ఉన్నప్పుడు మరొక వ్యక్తిని ఇష్టపడటం లేదా చనువుగా ఉన్నట్లు కనిపించడం మీ మధ్య అపార్థాలను సృష్టిస్తుంది. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. (Freepik)
సమస్యను పరిష్కరించకపోవడం: సమస్య;లు  పరిష్కారం కాకపోవడం, ఇదే సమయంలో కొత్త సమస్యలు రావడం వలన కోపం, ఆగ్రహం పెరగవచ్చు. మీ కోపం వలన మీ భాగస్వామి చాలా కలత చెందవచ్చు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం లభించటానికి కొంత సమయం అవసరమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి కలత చెందకండి లేదా కోపం తెచ్చుకోకండి. 
(3 / 5)
సమస్యను పరిష్కరించకపోవడం: సమస్య;లు  పరిష్కారం కాకపోవడం, ఇదే సమయంలో కొత్త సమస్యలు రావడం వలన కోపం, ఆగ్రహం పెరగవచ్చు. మీ కోపం వలన మీ భాగస్వామి చాలా కలత చెందవచ్చు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం లభించటానికి కొంత సమయం అవసరమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి కలత చెందకండి లేదా కోపం తెచ్చుకోకండి. (Freepik)
స్వాతంత్య్రం: సంబంధంలో స్వాతంత్య్రం కూడా ముఖ్యమైనది. భాగస్వామిపై పట్టు సాధించడం కోసం వారి స్వాతంత్య్రాన్ని దూరం చేయవద్దు. పరిమితి పెట్టండి కానీ అతిగా జోక్యం చేసుకోవడం సంబంధాలలో సమస్యలను సృష్టిస్తుంది. రిలేషన్ షిప్ లో కూడా భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వడం మంచిదని నిపుణుల అభిప్రాయం. 
(4 / 5)
స్వాతంత్య్రం: సంబంధంలో స్వాతంత్య్రం కూడా ముఖ్యమైనది. భాగస్వామిపై పట్టు సాధించడం కోసం వారి స్వాతంత్య్రాన్ని దూరం చేయవద్దు. పరిమితి పెట్టండి కానీ అతిగా జోక్యం చేసుకోవడం సంబంధాలలో సమస్యలను సృష్టిస్తుంది. రిలేషన్ షిప్ లో కూడా భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వడం మంచిదని నిపుణుల అభిప్రాయం. (Freepik)
ఆర్థిక అంశాలు: సంబంధాలపై అవగాహన బాగానే ఉన్నప్పటికీ, ఒకరి ఆర్థిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. దీనివల్ల సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఇది అపార్థాలకు దారితీస్తుంది.
(5 / 5)
ఆర్థిక అంశాలు: సంబంధాలపై అవగాహన బాగానే ఉన్నప్పటికీ, ఒకరి ఆర్థిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. దీనివల్ల సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఇది అపార్థాలకు దారితీస్తుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి