తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Police Arrested Bjp State President Bandi Sanjay At Gunpark In Hyderabad

TSPSC Paper Leak : గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌ అరెస్ట్

17 March 2023, 16:26 IST

Bandi Sanjay Deeksha at GunPark: హైదరాబాద్ గన్ పార్కు వద్ద దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ దీక్షకు దిగిన బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

  • Bandi Sanjay Deeksha at GunPark: హైదరాబాద్ గన్ పార్కు వద్ద దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ దీక్షకు దిగిన బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. 
(1 / 5)
బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. (twitter)
దీక్షలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే పోలీసులు మైక్ కట్ చేశారు. వెంటనే వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.  
(2 / 5)
దీక్షలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే పోలీసులు మైక్ కట్ చేశారు. వెంటనే వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.  (twitter)
దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని బండి సంజయ్‌ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు నుంచి బయల్దేరే క్రమంలో వారిని చుట్టుముట్టారు. 
(3 / 5)
దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని బండి సంజయ్‌ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు నుంచి బయల్దేరే క్రమంలో వారిని చుట్టుముట్టారు. (twitter)
పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
(4 / 5)
పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  (twitter)
పేపర్ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ తర్వాత…  బండి సంజయ్ ను కార్ఖానా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
(5 / 5)
పేపర్ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ తర్వాత…  బండి సంజయ్ ను కార్ఖానా పోలీస్ స్టేషన్ కు తరలించారు.(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి