తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pm Narendra Modi Holds Bilateral Talks With Japanese Counterpart Fumio Kishida

PM Modi: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ‘పరస్పర ఆహ్వానం’: కీలక విషయాలివే

20 March 2023, 15:33 IST

PM Narendra Modi: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida).. భారత పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దైపాక్షిక అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్‍ ఆతిథ్యమివ్వనుండగా.. జపాన్ వేదికగా జీ7 సమ్మిట్ జరగనుంది. 

  • PM Narendra Modi: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida).. భారత పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దైపాక్షిక అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్‍ ఆతిథ్యమివ్వనుండగా.. జపాన్ వేదికగా జీ7 సమ్మిట్ జరగనుంది. 
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‍లో జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాతో సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.
(1 / 8)
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‍లో జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాతో సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.(ANI/PIB)
ఈ ఏడాది జపాన్‍లో జరగనున్న జీ7 సదస్సుకు తనను ఆహ్వానించినందుకు కుషిదాకు కృతజ్ఞతలు చెప్పారు మోదీ. 
(2 / 8)
ఈ ఏడాది జపాన్‍లో జరగనున్న జీ7 సదస్సుకు తనను ఆహ్వానించినందుకు కుషిదాకు కృతజ్ఞతలు చెప్పారు మోదీ. (PTI)
“మేలో హిరోషిమాలో జరగనున్న జీ7 లీడర్స్ సదస్సుకు రావాలని జపాన్ ప్రధాని ఫుమియో కుషిదా నేను నన్ను ఆహ్వానించారు. దీనికి నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా” అని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
(3 / 8)
“మేలో హిరోషిమాలో జరగనున్న జీ7 లీడర్స్ సదస్సుకు రావాలని జపాన్ ప్రధాని ఫుమియో కుషిదా నేను నన్ను ఆహ్వానించారు. దీనికి నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా” అని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.(PTI)
“నేను జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాను ఆహ్వానించా. గత సంవత్సరంగా జపాన్ ప్రధానిని పలుమార్లు కలిశాను. ఇండియా-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఆయన సానుకూలతను, నిబద్ధతను ప్రతీసారి గుర్తించా. సంబంధాలు మెరుగ్గా కొనసాగేందుకు ఆయన నేటి పర్యటన మరింత దోహదం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు. 
(4 / 8)
“నేను జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాను ఆహ్వానించా. గత సంవత్సరంగా జపాన్ ప్రధానిని పలుమార్లు కలిశాను. ఇండియా-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఆయన సానుకూలతను, నిబద్ధతను ప్రతీసారి గుర్తించా. సంబంధాలు మెరుగ్గా కొనసాగేందుకు ఆయన నేటి పర్యటన మరింత దోహదం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు. (PTI)
భారత్‍లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ20 సదస్సుకు జపాన్ ప్రధానిని ఆహ్వానించినట్టు భారత పీఎం మోదీ తెలిపారు. 
(5 / 8)
భారత్‍లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ20 సదస్సుకు జపాన్ ప్రధానిని ఆహ్వానించినట్టు భారత పీఎం మోదీ తెలిపారు. (AP)
ఇండియా-జపాన్ బంధం మరింత బలపడడమే ఈ మీటింగ్ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. 
(6 / 8)
ఇండియా-జపాన్ బంధం మరింత బలపడడమే ఈ మీటింగ్ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. (PTI)
జీ20 ప్రాధాన్యతల గురించి ఫుమియో కిషిదాతో చర్చించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ సౌత్ స్వరాన్ని వినిపించడమే తమ ధ్యేయమని తెలిపారు. 
(7 / 8)
జీ20 ప్రాధాన్యతల గురించి ఫుమియో కిషిదాతో చర్చించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ సౌత్ స్వరాన్ని వినిపించడమే తమ ధ్యేయమని తెలిపారు. (ANI)
“భారత్-జపాన్ మధ్య భాగస్వామ్యం బలపడడం ఇరు దేశాలకు ఉపయోగపడడమే కాక, ఇండో-పసిఫిక్‍లో శాంతి, అభివృద్ధి, స్థిరత పెరిగేందుకు దోహదం చేస్తుంది” అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 
(8 / 8)
“భారత్-జపాన్ మధ్య భాగస్వామ్యం బలపడడం ఇరు దేశాలకు ఉపయోగపడడమే కాక, ఇండో-పసిఫిక్‍లో శాంతి, అభివృద్ధి, స్థిరత పెరిగేందుకు దోహదం చేస్తుంది” అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి