తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ujjain Guinness Record | శివరాత్రి రోజు గిన్నీస్ రికార్డు సృష్టించిన ఉజ్జయిని

Ujjain Guinness Record | శివరాత్రి రోజు గిన్నీస్ రికార్డు సృష్టించిన ఉజ్జయిని

02 March 2022, 13:19 IST

శివునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో ఉన్నాడు. గతేడాది అయోధ్యలో నెలకొల్పిన రికార్డును.. మహాశివరాత్రి రోజున మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బద్దలు కొట్టింది. 11.7 లక్షల నూనె దీపాలను వెలిగించి సరికొత్త రికార్డును సృష్టించింది.

  • శివునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో ఉన్నాడు. గతేడాది అయోధ్యలో నెలకొల్పిన రికార్డును.. మహాశివరాత్రి రోజున మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బద్దలు కొట్టింది. 11.7 లక్షల నూనె దీపాలను వెలిగించి సరికొత్త రికార్డును సృష్టించింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పట్టణాన్ని, 'ల్యాండ్ ఆఫ్ మహాకాల్' అని కూడా పిలుస్తారు. టెంపుల్ టౌన్​గా పిలిచే ఉజ్జయినీలో.. మహాశివరాత్రి సందర్భంగా 11.71 లక్షలకు పైగా దీపాలను వెలిగించి.. గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు.
(1 / 7)
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పట్టణాన్ని, 'ల్యాండ్ ఆఫ్ మహాకాల్' అని కూడా పిలుస్తారు. టెంపుల్ టౌన్​గా పిలిచే ఉజ్జయినీలో.. మహాశివరాత్రి సందర్భంగా 11.71 లక్షలకు పైగా దీపాలను వెలిగించి.. గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు.(ANI)
మొత్తం 11,71,878 దీపాలను వెలిగించి రికార్డు సృష్టించడమే కాకుండా, ఈ పవిత్ర వేడుక చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించారని మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ హర్షం వ్యక్తం చేశారు. గిన్నిస్ వరల్డ్​ రికార్డు నుంచి సర్టిఫికేట్​ను స్వీకరిస్తున్న ఫోటోను ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.
(2 / 7)
మొత్తం 11,71,878 దీపాలను వెలిగించి రికార్డు సృష్టించడమే కాకుండా, ఈ పవిత్ర వేడుక చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించారని మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ హర్షం వ్యక్తం చేశారు. గిన్నిస్ వరల్డ్​ రికార్డు నుంచి సర్టిఫికేట్​ను స్వీకరిస్తున్న ఫోటోను ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.(ANI)
మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన 'శివజ్యోతి అర్పణం' అనే గొప్ప కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాంస్కృతిక శాఖతో, నగర పాలక సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
(3 / 7)
మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన 'శివజ్యోతి అర్పణం' అనే గొప్ప కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాంస్కృతిక శాఖతో, నగర పాలక సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.(ANI)
గత నవంబర్‌లో అయోధ్యలో నెలకొల్పిన 9.41 లక్షల దీపాల రికార్డును ఉజ్జయిని బద్దలు కొట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. రామ్‌ఘాట్, దత్ అఖారా, నార్సింగ్ ఘాట్, గురునానక్ ఘాట్, సున్‌హారీ ఘాట్‌లలో ఒకే కాలంలో 11.71 లక్షల దీపాలు (మట్టి దీపాలు) వెలిగించారు.
(4 / 7)
గత నవంబర్‌లో అయోధ్యలో నెలకొల్పిన 9.41 లక్షల దీపాల రికార్డును ఉజ్జయిని బద్దలు కొట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. రామ్‌ఘాట్, దత్ అఖారా, నార్సింగ్ ఘాట్, గురునానక్ ఘాట్, సున్‌హారీ ఘాట్‌లలో ఒకే కాలంలో 11.71 లక్షల దీపాలు (మట్టి దీపాలు) వెలిగించారు.(AFP)
ఈ కార్యక్రమంలో 17,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. శివజ్యోతి అర్పణం పర్యావరణ అనుకూలమైనదని, 'జీరో వేస్ట్' లక్ష్యాన్ని సాధించడానికి నగర పాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అధికారులు వెల్లడించారు.
(5 / 7)
ఈ కార్యక్రమంలో 17,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. శివజ్యోతి అర్పణం పర్యావరణ అనుకూలమైనదని, 'జీరో వేస్ట్' లక్ష్యాన్ని సాధించడానికి నగర పాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అధికారులు వెల్లడించారు.(PTI)
పర్యావరణ అనుకూల చర్యలలో భాగంగా.. రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేసిన స్వచ్ఛంద గుర్తింపు కార్డుల వాడటం, దీపాలు, కొవ్వొత్తులను వెలిగించడానికి పేపర్ అగ్గిపెట్టెలను ఉపయోగించారు. ఆహారం, పానీయాల కోసం బయోడిగ్రేడబుల్ కత్తులు, ప్లేట్లను వినియోగించారు.
(6 / 7)
పర్యావరణ అనుకూల చర్యలలో భాగంగా.. రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేసిన స్వచ్ఛంద గుర్తింపు కార్డుల వాడటం, దీపాలు, కొవ్వొత్తులను వెలిగించడానికి పేపర్ అగ్గిపెట్టెలను ఉపయోగించారు. ఆహారం, పానీయాల కోసం బయోడిగ్రేడబుల్ కత్తులు, ప్లేట్లను వినియోగించారు.(AFP)
ఉజ్జయినిలో 'మహాశివరాత్రి' సందర్భంగా 'శివజ్యోతి అర్పణం' వద్ద క్షిప్రా నది ఒడ్డున వెలిగించే దీపాల వైమానిక దృశ్యమిది.
(7 / 7)
ఉజ్జయినిలో 'మహాశివరాత్రి' సందర్భంగా 'శివజ్యోతి అర్పణం' వద్ద క్షిప్రా నది ఒడ్డున వెలిగించే దీపాల వైమానిక దృశ్యమిది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి