తెలుగు న్యూస్  /  Photo Gallery  /  List Of Government Banks That Offer Highest Interest Rates On Fixed Deposits

Highest Interest Rates on FD's : ఎఫ్​డీలపై అధిక వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్​లు ఇవే!

01 March 2023, 10:45 IST

Highest Interest Rates on FD's : ఆర్​బీఐ.. గత కొంతకాలంగా వడ్డీ రేట్లను పెంచుతోంది. రానున్న రోజుల్లోనూ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంక్​లు కూడా ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఎఫ్​డీలపై మొగ్గుచూపుతున్నారు. అయితే.. అధిక వడ్డీ ఇస్తోంది కదా అని ముందు వెనుక చూసుకోకుండా కొన్ని బ్యాంక్​లలో డబ్బులు పెట్టడం రిస్క్​. ప్రభుత్వ ఆధారిత బ్యాంక్​లలో రిస్క్​ తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఎఫ్​డీలపై 8.5శాతం వరకు వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్​ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

  • Highest Interest Rates on FD's : ఆర్​బీఐ.. గత కొంతకాలంగా వడ్డీ రేట్లను పెంచుతోంది. రానున్న రోజుల్లోనూ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంక్​లు కూడా ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఎఫ్​డీలపై మొగ్గుచూపుతున్నారు. అయితే.. అధిక వడ్డీ ఇస్తోంది కదా అని ముందు వెనుక చూసుకోకుండా కొన్ని బ్యాంక్​లలో డబ్బులు పెట్టడం రిస్క్​. ప్రభుత్వ ఆధారిత బ్యాంక్​లలో రిస్క్​ తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఎఫ్​డీలపై 8.5శాతం వరకు వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్​ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.
ఎస్​బీఐ:- 400 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 7.10శాతం వడ్డీని ఇస్తోంది ఎస్​బీఐ. సీనియర్​ సిటిజెన్​లకు అయితే అది 7.60శాతంగా ఉంది.
(1 / 5)
ఎస్​బీఐ:- 400 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 7.10శాతం వడ్డీని ఇస్తోంది ఎస్​బీఐ. సీనియర్​ సిటిజెన్​లకు అయితే అది 7.60శాతంగా ఉంది.(Bloomberg)
సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- 444 రోజుల వ్యవధికి సంబంధించిన ఎఫ్​డీలపై సీనియస్​ సిటిజెన్​లకు 7.85శాతం వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​.​ సాధారణ ప్రజలకైతే అది 7.35శాతంగా ఉంది. 
(2 / 5)
సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- 444 రోజుల వ్యవధికి సంబంధించిన ఎఫ్​డీలపై సీనియస్​ సిటిజెన్​లకు 7.85శాతం వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​.​ సాధారణ ప్రజలకైతే అది 7.35శాతంగా ఉంది. (MINT_PRINT)
పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​:- 221 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 8శాతం వరకు వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​. సీనియర్​ సిటిజెన్​లకు అది 8.50శాతంగా ఉండటం విశేషం. 
(3 / 5)
పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​:- 221 రోజుల కాల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై 8శాతం వరకు వడ్డీని ఇస్తోంది ఈ బ్యాంక్​. సీనియర్​ సిటిజెన్​లకు అది 8.50శాతంగా ఉండటం విశేషం. (REUTERS)
ఇండియన్​ బ్యాంక్​:- ఇండియన్​ బ్యాంక్​లో రెగ్యులర్​ ఎఫ్​డీలపై 7శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్​ సిటిజెన్​లకు అది 7.50శాతంగా ఉంది. 
(4 / 5)
ఇండియన్​ బ్యాంక్​:- ఇండియన్​ బ్యాంక్​లో రెగ్యులర్​ ఎఫ్​డీలపై 7శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్​ సిటిజెన్​లకు అది 7.50శాతంగా ఉంది. (MINT_PRINT)
కెనెరా బ్యాంక్​:- ఈ బ్యాంక్​.. 400 రోజుల టెన్యూర్​ ఉన్న ఎఫ్​డీలకు సీనియర్​ సిటిజెన్​లకైతే 7.65శాతం, సాధారణ ప్రజలకైతే 7.15శాతం వడ్డీని ఇస్తోంది. 
(5 / 5)
కెనెరా బ్యాంక్​:- ఈ బ్యాంక్​.. 400 రోజుల టెన్యూర్​ ఉన్న ఎఫ్​డీలకు సీనియర్​ సిటిజెన్​లకైతే 7.65శాతం, సాధారణ ప్రజలకైతే 7.15శాతం వడ్డీని ఇస్తోంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి