తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Holiday : మంగళవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు..​

stock market holiday : మంగళవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు..​

Sharath Chitturi HT Telugu

24 October 2023, 7:58 IST

google News
    • Stock market holiday : స్టాక్​ మార్కెటలకు మంగళవారం సెలవు. ఈక్విటీతో పాటు డెరివేటివ్స్​లో ఎలాంటి ట్రేడింగ్​ కార్యకలాపాలు జరగవు.
రేపు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..
రేపు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..

రేపు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..

stock market holiday : మంగళవారం, అంటే అక్టోబర్​ 24న దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉండనుంది. దసరా నేపథ్యంలో బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు మూతపడి ఉంటాయి. పూర్తి వివరాలు..

స్టాక్​ మార్కెట్​ హాలిడే..

దక్షిణాది ప్రజలు దసరా పండుగను సోమవారం జరుపుకున్నారు. కాగా.. ఉత్తరాదిలో చాలా మంది ఈ దసరా పండుగను మంగళవారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పనిచేసిన స్టాక్​ మార్కెట్​లు మంగళవారం సెలవు తీసుకోనున్నాయి.

స్టాక్​ మార్కెట్​ సెలవులకు సంబంధించిన డేటా బీఎస్​ఈ అధికారిక వెబ్​సైట్​లో ఉంటుంది. bseindia.com లోకి వెళ్లి.. 'ట్రేడింగ్​ హాలిడేస్​' మీద క్లిక్​ చేసి, సెలవుల లిస్ట్​ను పొందొచ్చు. 2023కు సంబంధించిన పూర్తి సెలవుల డేటా కనిపిస్తుంది.

stock market holiday Dussehra : ఇక బీఎస్​ఈ వెబ్​సైట్​లో ఉన్న డేటా ప్రకారం.. మంగళవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు. దసరా నేపథ్యంలో ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈలు సెలవులో ఉంటాయి. తిరిగి.. బుధవారం స్టాక్​ మార్కెట్​లు ఓపెన్​ అవుతాయి.

బీఎస్​ఈ ప్రకారం.. ఈక్విటీ సెగ్మెంట్​, ఈక్విటీ డెరివేటివ్​ సెగ్మెంట్​, ఎస్​ఎల్​బీ సెగ్మెంట్​, కరెన్సీ డెరివేటివ్స్​ సెగ్మెంట్​లో మంగళవారం ట్రేడింగ్​కి వీలు ఉండదు. కమోడిటీ డెరివేటివ్​ సెగ్మెంట్​, ఎలక్ట్రానిక్​ గోల్డ్​ రిసిప్ట్స్​ సెగ్మెంట్​లు మార్నింగ్​ సెషన్​లో పని చేయవుత. మార్నింగ్​ సెషన్​ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక ఈవినింగ్​ సెషన్​లో కార్యకలాపాలు మొదలవుతాయి. ఈవినింగ్​ సెషన్​ అంటే సాయంత్రం 5 గంటల తరువాత.

ఈ నెలలో స్టాక్​ మార్కెట్​లకు ఇప్పటికే ఒక సెలవు లభించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్​ 2న మార్కెట్​లు మూతపడ్డాయి. ఇక దసరాకి కూడా సెలవులో ఉంటాయి.

stock market holiday today : ఇక దసరా తర్వాత.. వచ్చే నెలలో దేశీయ సూచీలకు రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అవి.. నవంబర్​ 14 (దీపావళి బలిప్రాతిపద), నవంబర్​ 27 (గురునానక్​ జయంతి). చివరిగా.. డిసెంబర్​లో క్రిస్మస్​ (డిసెంబర్​ 25) రోజున స్టాక్​ మార్కెట్​లు పనిచేయవు.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​..

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ విషయానికొస్తే.. దేశీయ సూచీలు దారుణంగా పతనమయ్యాయి. ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో దేశీయ మార్కెట్​లు కూడా క్రాష్​ అయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 826 పాయింట్లు కోల్పోయి 64,572 వద్దకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్ఠం. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 261 పాయింట్ల లాస్​తో 19,281 వద్ద సథిరపడింది. నిఫ్టీ మిడ్​క్యాప్​ 2.88శాతం, నిఫ్టీ స్మాల్​ క్యాప్​ 3.8శాతం మేర నష్టపోయాయి.

2007 తర్వాత.. అమెరికా 10- ఇయర్​ బాండ్​ యీల్డ్స్​ తొలిసారి 5శాతాన్ని తాకడం కూడా నేటి ఇండియన్​ స్టాక్​ మార్కెట్​ క్రాష్​కు కారణమని నిపుణులు చెబుతున్నారు.

stock market news today : బీఎస్​ఈ సెన్సెక్స్​ 30లోని 28 స్టాక్స్​.. నష్టాల్లో ముగిశాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్​ 2.99శాతం, టాటా స్టీల్​ 2.52శాతం, టీసీఎస్​ 2.4శాతం, టాటా మోటార్స్​ 2.3శాతం మేర నష్టపోయాయి. బజాజ్​ ఫైనాన్స్​, ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే స్వల్పంగా లాభాలను చూశాయి.

తదుపరి వ్యాసం