Gandhi Jayanti Wishes In Telugu : ఇలా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పండి-happy gandhi jayanti 2023 gandhi jayanti wishes messages quotes images facebook whatsapp status in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gandhi Jayanti Wishes In Telugu : ఇలా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పండి

Gandhi Jayanti Wishes In Telugu : ఇలా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పండి

HT Telugu Desk HT Telugu
Oct 02, 2023 09:35 AM IST

Gandhi Jayanti Wishes : అక్టోబర్ 2న గాంధీ జయంతి. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. బాపు జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. గాంధీ జయంతి సందర్భంగా కింది విధంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పండి.

గాంధీ జయంతి
గాంధీ జయంతి

Gandhi Jayanti Wishes In Telugu : జాతిపిత మహాత్మా గాంధీకి యావత్ భారతదేశం సలామ్ చేస్తోంది. బాపు కారణంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం ఒక కొత్త దిశను మార్చుకుంది. దేశ స్వాతంత్య్రం కోసం బాపు తన జీవితాన్ని త్యాగం చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి. మీ సన్నిహితులకు గాంధీ జయంతి శుభకాంక్షలు తెలపండి.

దండి మార్చ్, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, స్వదేశీ ఉద్యమాలతో స్వాతంత్ర్య పోరాటాలకు పునాది వేసి నడిపించారు గాంధీజీ. అక్టోబర్ 2, 1869న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. ఆయన జన్మదినం సందర్భంగా భారతదేశంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి జరుపుకొంటారు. గాంధీ జయంతి నాడు మీ సన్నిహితులకు శుభకాంక్షలు చెప్పేందుకు ఉత్తమ సందేశాలు ఇక్కడ ఉన్నాయి..

ఖాదీ నా గర్వం, పని నా ఆరాధన, సత్యం నా పని, భారతదేశం నా జీవితం.. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

సత్యం అనే తైలంతో అహింస అనే వత్తి.. అజరామర జ్వాలగా జ్వలిస్తూనే ఉంటుంది. ప్రపంచం మొత్తం బాపూ నీ అడుగుజాడల్లో కదలాలి . గాంధీ జయంతి శుభాకాంక్షలు!

గాంధీ వేషధారణ సరళమైనది, ఆయనకు గర్వం లేదు.. బాపు ఖాదీ ధోతీ ధరించి మాత్రమే గర్వించేవారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

బాపు భూమి మీద వింత యుద్ధం చేశాడు, ఏ ఫిరంగి పేల్చలేదు, తుపాకీ కాల్చలేదు, శత్రు కోటపై కూడా దాడి చేయలేదు, కానీ అనుకున్నది సాధించాడు.. నువ్ ఎంత గొప్పొడివి బాపు.. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

మాకు కత్తి, యుద్ధం లేకుండానే స్వాతంత్య్రం ఇచ్చారు, సబర్మతీ సాధువు మీరు అద్భుతాలు చేశారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

రఘుపతి రాఘవ రాజారాం.. పతిత పావన సీతారాం.. ఈశ్వర్ అల్లా తేరోనాం.. సబ్‌కో సన్మతి దే భగవాన్.. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

ఒక సత్యం, ఒక అహింస అనే ఆయుధాలు భారతదేశానికి విముక్తి కలిగించాయి. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

సత్యం, అహింస అనే ఆయుధాలతో నువ్వు నీ దేశాన్ని రక్షించావు, తెల్లదొరలను తరిమికొట్టావు, శత్రువును ప్రేమించావు, ప్రజలకు ఉపకారం చేశావు, గాంధీ నీకు నమస్కరిస్తున్నాం.. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

దేశం కోసం విలాసాలను తిరస్కరించి, విదేశీ దారులను వదులుకుని, స్వయంగా ఖాదీని తయారు చేసి, చెక్క చెప్పులు ధరించి, సత్యాగ్రహ పాట పాడిన వ్యక్తి మహాత్మా గాంధీ. గాంధీ జయంతి శుభాకాంక్షలు!

Whats_app_banner