తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2023 Auction: ఈ ఇండియన్‌ యంగ్‌స్టర్స్‌పైనే అందరి కళ్లూ.. వేలంలో ఎంత పలుకుతారో?

IPL 2023 Auction: ఈ ఇండియన్‌ యంగ్‌స్టర్స్‌పైనే అందరి కళ్లూ.. వేలంలో ఎంత పలుకుతారో?

23 December 2022, 12:09 IST

IPL 2023 Auction: ఐపీఎల్‌ 2023 వేలంలో ఈ ఇండియన్‌ యంగ్‌స్టర్స్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. వీళ్లలో కొందరు గతంలో ఐపీఎల్‌లో ఆడగా ఆయా ఫ్రాంఛైజీలు రిలీజ్‌ చేయడంతో మళ్లీ వేలంలోకి వచ్చారు. మరి వీళ్లలో ఎవరు ఎంత ధర పలుకుతారో చూడాలి.

  • IPL 2023 Auction: ఐపీఎల్‌ 2023 వేలంలో ఈ ఇండియన్‌ యంగ్‌స్టర్స్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. వీళ్లలో కొందరు గతంలో ఐపీఎల్‌లో ఆడగా ఆయా ఫ్రాంఛైజీలు రిలీజ్‌ చేయడంతో మళ్లీ వేలంలోకి వచ్చారు. మరి వీళ్లలో ఎవరు ఎంత ధర పలుకుతారో చూడాలి.
IPL 2023 Auction: వీళ్లలో అందరి కన్నా ముందున్న వ్యక్తి శివమ్ మావి. అతడు గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. కొత్త బంతిని స్వింగ్ చేయగలడు. పవర్‌ప్లేలో వికెట్ టేకర్. అయితే గత ఐపీఎల్‌లో గాయాలు, ఫామ్‌ సమస్యలతో మావి ఇబ్బంది పడ్డాడు. అతను ఆరు మ్యాచ్‌లలో కేవలం ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్‌ చేసింది. గత మెగా వేలంలో కోల్‌కతా అతన్ని రూ. 7.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి వేలంలో అతన్ని ఎవరు తీసుకుంటారో చూడాలి. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా ఉన్న శివమ్‌ మావికి వేలంలో పోటీ నెలకొనే అవకాశం ఉంది.
(1 / 6)

IPL 2023 Auction: బెంగాల్‌కు చెందిన ముఖేష్ కుమార్ కూడా ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంఛైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ పేస్‌ బౌలర్‌ ఇండియా ఎ టీమ్‌ తరఫున న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లపై మంచి ప్రదర్శన చేశాడు. నిజానికి గత సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ముఖేష్‌ ఉన్నా.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇప్పటి వరకూ అతడు ఐపీఎల్‌లో ఆడలేదు. మంచి లైన్‌ అండ్ లెంత్‌తో బౌలింగ్‌ చేసే ముఖేష్‌కు ఈసారి ఐపీఎల్‌ వేలంలో మండి డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది.
(2 / 6)

IPL 2023 Auction: యశ్ ఠాకూర్ విదర్భ పేస్ బౌలర్‌. ఈ మధ్యే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో 10 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసుకున్నాడు. డెత్‌ బౌలింగ్‌ స్పెషలిస్ట్‌గా పేరుంది. అతని ఎకానమీ కూడా 7.17తో అద్భుతంగా ఉంది. గత ఐపీఎల్‌ సీజన్లలో నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. గత వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ అతన్ని తీసుకుంది. మరి ఇప్పుడు ఏ ఫ్రాంఛైజీ అతని కోసం బిడ్‌ దాఖలు చేస్తుందో చూడాలి.
(3 / 6)

IPL 2023 Auction: ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాశ్‌ వశిత్ కలలు కంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్ టీమ్‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ చేరడంలో ఇతనిదే కీ రోల్‌. ఆకాశ్‌ ఓ ఆల్ రౌండర్. బ్యాటింగ్‌లోనే కాదు తన స్పిన్‌తోనూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అతడు ఏకంగా 163.63 స్ట్రైక్‌రేట్‌తో 216 రన్స్‌ చేయడం విశేషం. 
(4 / 6)

IPL 2023 Auction: ఇతని పేరు సన్వీర్‌ సింగ్‌. పంజాబ్‌కు చెందిన ఇతడు.. ఈ మధ్య దేశవాళీ సీజన్‌లో అటు సీమ్‌బౌలింగ్‌తో ఇటు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినా.. ఏకంగా 205 స్ట్రైక్‌రేట్‌తో 119 రన్స్‌ చేయడం విశేషం. ఈ రైడ్‌ హ్యాండ్‌ సీమ్‌ బౌలర్‌ విజయ్ హజారే ట్రోఫీలో 7 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు 156 రన్స్‌ కూడా చేశాడు. వేలంలో అతడు రూ.20 లక్షల కనీస ధరతో ఉన్నాడు.
(5 / 6)

IPL 2023 Auction: వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎన్‌ జగదీశన్‌ గత సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు. ధోనీలాంటి ప్లేయర్‌ టీమ్‌లో ఉండటంతో తుది జట్టులో ఆడే అవకాశం అతనికి రాలేదు. చెన్నై టీమ్‌ కేవలం రూ.20 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది. అయితే ఈ వేలానికి ముందు రిలీజ్ చేసింది. 27 ఏళ్ల జగదీశన్‌ లిస్ట్‌ ఎ క్రికెట్‌లో ఐదు వరుస సెంచరీలు బాదడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ అతడే. హైదరాబాద్‌పై కేవలం 77 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. వేలంలో గుజరాత్ టైటన్స్‌ జగదీశన్‌ కోసం ప్రయత్నించవచ్చు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి