తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Independence Day 2022: ఎర్రకోటలో తొమ్మిదోసారి.. జాతీయ జెండా ఎగురవేసిన మోదీ

Independence Day 2022: ఎర్రకోటలో తొమ్మిదోసారి.. జాతీయ జెండా ఎగురవేసిన మోదీ

15 August 2022, 11:51 IST

భారతదేశం స్వాతంత్య్రం పొంది 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎర్రకోట ప్రాకారం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

  • భారతదేశం స్వాతంత్య్రం పొంది 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎర్రకోట ప్రాకారం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ప్రాకారాల క్రింద ఉన్న కందకంపై నేరుగా జాతీయ జెండా ముందు ఉంచిన గార్డ్ ఆఫ్ హానర్‌ను ఆయన పరిశీలించారు.
(1 / 8)
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ప్రాకారాల క్రింద ఉన్న కందకంపై నేరుగా జాతీయ జెండా ముందు ఉంచిన గార్డ్ ఆఫ్ హానర్‌ను ఆయన పరిశీలించారు.(PTI)
ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. వివిధ పోలీసు బలగాలు ప్రధాన మంత్రికి సాధారణ గౌరవ వందనం సమర్పించాయి.
(2 / 8)
ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. వివిధ పోలీసు బలగాలు ప్రధాన మంత్రికి సాధారణ గౌరవ వందనం సమర్పించాయి.(PTI)
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 'స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరం నాటికి, మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న ఆశయాలు సాధించాలనే దృక్పథంతో మనం పని చేయాలి." అని అన్నారు.
(3 / 8)
76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 'స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరం నాటికి, మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న ఆశయాలు సాధించాలనే దృక్పథంతో మనం పని చేయాలి." అని అన్నారు.(PTI)
"రాబోయే 25 సంవత్సరాల జీవితాలను దేశాభివృద్ధికి అంకితం చేయాలని నేను యువతను కోరుతున్నాను. మొత్తం మానవాళి అభివృద్ధికి కూడా మేం కృషి చేస్తాం.. అదే భారతదేశ బలం..’ అని ప్రధాని మోదీ అన్నారు.
(4 / 8)
"రాబోయే 25 సంవత్సరాల జీవితాలను దేశాభివృద్ధికి అంకితం చేయాలని నేను యువతను కోరుతున్నాను. మొత్తం మానవాళి అభివృద్ధికి కూడా మేం కృషి చేస్తాం.. అదే భారతదేశ బలం..’ అని ప్రధాని మోదీ అన్నారు.(PTI)
‘రాబోయే 25 సంవత్సరాల పాటు మనం ఐదు సంకల్పాలపై దృష్టి పెట్టాలి-1. అభివృద్ధి చెందిన భారతదేశం, 2.మన మనస్సు నుండి బానిసత్వాన్ని తొలగించడం, 3. మన అద్భుతమైన వారసత్వంపై గర్వపడడం 4. ఐకమత్యం 5. మన బాధ్యతలను నెరవేర్చడం" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
(5 / 8)
‘రాబోయే 25 సంవత్సరాల పాటు మనం ఐదు సంకల్పాలపై దృష్టి పెట్టాలి-1. అభివృద్ధి చెందిన భారతదేశం, 2.మన మనస్సు నుండి బానిసత్వాన్ని తొలగించడం, 3. మన అద్భుతమైన వారసత్వంపై గర్వపడడం 4. ఐకమత్యం 5. మన బాధ్యతలను నెరవేర్చడం" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.(PTI)
జెండా వందనం కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
(6 / 8)
జెండా వందనం కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.(PTI)
ప్రధాని మోదీ తన 76వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం త్రివర్ణ చారలతో కూడిన తెల్లటి సఫాను ధరించారు.
(7 / 8)
ప్రధాని మోదీ తన 76వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం త్రివర్ణ చారలతో కూడిన తెల్లటి సఫాను ధరించారు.(ANI)
నీలిరంగు జాకెట్, నల్లటి షూతో కూడిన సాంప్రదాయక తెల్లని కుర్తా ధరించి ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.
(8 / 8)
నీలిరంగు జాకెట్, నల్లటి షూతో కూడిన సాంప్రదాయక తెల్లని కుర్తా ధరించి ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి