తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Russia Ukraine War : యుద్ధానికి ఏడాది పూర్తి.. ప్రపంచానికి పట్టిన గ్రహణం వీడేదెన్నడు!

Russia Ukraine war : యుద్ధానికి ఏడాది పూర్తి.. ప్రపంచానికి పట్టిన గ్రహణం వీడేదెన్నడు!

24 February 2023, 11:56 IST

Russia Ukraine war anniversary : 2022 ఫిబ్రవరి 24న.. ప్రపంచాన్ని షాక్​కు గురిచేస్తూ.. ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగింది రష్యా. అప్పటి నుంచి లక్షలాది మంది.. నివాసాలు కోల్పోయారు. వేలాది మంది మరణించారు. ఆ కన్నీటి కథలను ప్రపంచ సాక్ష్యంగా నిలిచింది. నేటితో ఈ యుద్ధానికి ఏడాది ముగిసింది. కానీ రష్యా ఉక్రెయిన్​ యుద్ధానికి మాత్రం ముగింపు కనిపించడం లేదు.

  • Russia Ukraine war anniversary : 2022 ఫిబ్రవరి 24న.. ప్రపంచాన్ని షాక్​కు గురిచేస్తూ.. ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగింది రష్యా. అప్పటి నుంచి లక్షలాది మంది.. నివాసాలు కోల్పోయారు. వేలాది మంది మరణించారు. ఆ కన్నీటి కథలను ప్రపంచ సాక్ష్యంగా నిలిచింది. నేటితో ఈ యుద్ధానికి ఏడాది ముగిసింది. కానీ రష్యా ఉక్రెయిన్​ యుద్ధానికి మాత్రం ముగింపు కనిపించడం లేదు.
యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్​ను వేడుకుంటున్నాయి. కానీ ఆయన ఎవరి మాటా వినడం లేదు. ఈ నేపథ్యంలో పుతిన్​పై వ్యతిరేకత మరింత పెరుగుతోంది.
(1 / 6)
యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్​ను వేడుకుంటున్నాయి. కానీ ఆయన ఎవరి మాటా వినడం లేదు. ఈ నేపథ్యంలో పుతిన్​పై వ్యతిరేకత మరింత పెరుగుతోంది.(REUTERS)
యుద్ధానికి 365 రోజులు ముగిసిన సందర్భంగా.. ప్రపంచ దేశాల్లో ఉక్రెయిన్​కు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. అమెరికా న్యూయార్క్​లో జరిగిన ఓ ర్యాలీలో దృశ్యం ఇది.
(2 / 6)
యుద్ధానికి 365 రోజులు ముగిసిన సందర్భంగా.. ప్రపంచ దేశాల్లో ఉక్రెయిన్​కు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. అమెరికా న్యూయార్క్​లో జరిగిన ఓ ర్యాలీలో దృశ్యం ఇది.(REUTERS)
ఈ ఏడాది కాలాన్ని.. ఉక్రెయిన్​ ప్రజల బాధ, దుఖం, విశ్వాసం- ఐక్యతగా అభివర్ణించారు ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ. చివరి వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
(3 / 6)
ఈ ఏడాది కాలాన్ని.. ఉక్రెయిన్​ ప్రజల బాధ, దుఖం, విశ్వాసం- ఐక్యతగా అభివర్ణించారు ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ. చివరి వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.(AP)
2022లో యుద్ధం మొదలైందని, 2023లో విజయం తమను వరిస్తుందని, రష్యా ఓటమి కోసం ఎదురుచూస్తున్నామని జెలెన్​స్కీ తెలిపారు.
(4 / 6)
2022లో యుద్ధం మొదలైందని, 2023లో విజయం తమను వరిస్తుందని, రష్యా ఓటమి కోసం ఎదురుచూస్తున్నామని జెలెన్​స్కీ తెలిపారు.(AP)
మరోవైపు ఉక్రెయిన్​ వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్​ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది.
(5 / 6)
మరోవైపు ఉక్రెయిన్​ వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్​ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది.(AP)
ఉక్రెయిన్​ నుంచి రష్యా వెనుదిరగాలని యూఎన్​లో ప్రవేశపెట్టిన తీర్మానం గట్టెక్కింది. 141 సభ్య దేశాలు.. తీర్మానానికి అనుకూలంగా ఓట్లేశారు. మరో 32 దేశాలు ఓటింగ్​కు దూరంగా  ఉండిపోయాయి. వీటిల్లో ఇండియా ఒకటి.
(6 / 6)
ఉక్రెయిన్​ నుంచి రష్యా వెనుదిరగాలని యూఎన్​లో ప్రవేశపెట్టిన తీర్మానం గట్టెక్కింది. 141 సభ్య దేశాలు.. తీర్మానానికి అనుకూలంగా ఓట్లేశారు. మరో 32 దేశాలు ఓటింగ్​కు దూరంగా  ఉండిపోయాయి. వీటిల్లో ఇండియా ఒకటి.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి