తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Top And Best Opening Pair In Icc T20 World Cup

Best Opening Pair: అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఎవరో తెలుసా? రోహిత్-రాహుల్ స్థ

11 October 2022, 9:11 IST

Top opening pairs at the T20 World Cup: అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్ కప్ 2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) 16 జట్లకు సంబంధించిన ఓపెనర్ల ర్యాంకులను ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే పలు జట్లు అక్కడకు చేరుకున్నాయి.

  • Top opening pairs at the T20 World Cup: అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్ కప్ 2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) 16 జట్లకు సంబంధించిన ఓపెనర్ల ర్యాంకులను ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే పలు జట్లు అక్కడకు చేరుకున్నాయి.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లకు ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకును ఇచ్చింది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బాబర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో అతడి ర్యాంకు దిగజారింది. 
(1 / 11)
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లకు ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకును ఇచ్చింది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బాబర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో అతడి ర్యాంకు దిగజారింది. (babar azam- instagram)
ప్రస్తుతం మొదటి స్థానంలో రిజ్వాన్ ఉన్నాడు. అతడు అత్యుత్తమ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. టీ20ల్లో 52 కి పైగా సగటుతో 128 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. గత ఐదు టీ20 ఇన్నింగ్సుల్లో 1, 63, 88, 8, 88 పరుగులు చేశాడు.
(2 / 11)
ప్రస్తుతం మొదటి స్థానంలో రిజ్వాన్ ఉన్నాడు. అతడు అత్యుత్తమ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. టీ20ల్లో 52 కి పైగా సగటుతో 128 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. గత ఐదు టీ20 ఇన్నింగ్సుల్లో 1, 63, 88, 8, 88 పరుగులు చేశాడు.(babar azam- instagram)
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడీ రెండో స్థానంలో ఉంది. కేఎల్ రాహుల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. 140.40 స్ట్రైక్ రేటుతో 39కి పైగా సగటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
(3 / 11)
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడీ రెండో స్థానంలో ఉంది. కేఎల్ రాహుల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. 140.40 స్ట్రైక్ రేటుతో 39కి పైగా సగటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.(hindustan times)
టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ప్రస్తుతం అతడు 16వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 31.94 సగటుతో 140.49 స్ట్రైక్ రేటుతో అతడు పరుగులు తీస్తున్నాడు.
(4 / 11)
టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ప్రస్తుతం అతడు 16వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 31.94 సగటుతో 140.49 స్ట్రైక్ రేటుతో అతడు పరుగులు తీస్తున్నాడు.(hindustan times)
అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో మూడో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్, డెవాన్ కాన్వే ఉన్నారు. కాన్వే ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థఆనంలో ఉన్నాడు. అతడు 138.28 స్ట్రైక్ రేటుతో 47కి పైగా సగటును కలిగి ఉన్నాడు.
(5 / 11)
అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో మూడో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్, డెవాన్ కాన్వే ఉన్నారు. కాన్వే ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థఆనంలో ఉన్నాడు. అతడు 138.28 స్ట్రైక్ రేటుతో 47కి పైగా సగటును కలిగి ఉన్నాడు.(devon conway- instagram)
మార్టిన్ గప్తిల్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ ర్యాంకులో ఉన్నాడు. అతడు 135.8 స్ట్రైక్ రేటుతో 31.79 సగటుతో ఉన్నాడు.
(6 / 11)
మార్టిన్ గప్తిల్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ ర్యాంకులో ఉన్నాడు. అతడు 135.8 స్ట్రైక్ రేటుతో 31.79 సగటుతో ఉన్నాడు.(devon conway- instagram)
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఫించ్ ఆరో స్థానంలో ఉన్నాడు. అతని 34.97 సగటుతో 144.88 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
(7 / 11)
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఫించ్ ఆరో స్థానంలో ఉన్నాడు. అతని 34.97 సగటుతో 144.88 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.(Aaron Finch- instagram)
ప్రస్తుతం టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 48వ స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అతడు 33.3 సగటుతో 141.18 స్ట్రైక్ రేటుతో ఆడుతున్నాడు.
(8 / 11)
ప్రస్తుతం టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 48వ స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అతడు 33.3 సగటుతో 141.18 స్ట్రైక్ రేటుతో ఆడుతున్నాడు.(Aaron Finch- instagram)
ఇటీవలే శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పాతుమ్ నిశాంక, వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేశారు. నిశాంక ప్రస్తుతం 8వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
(9 / 11)
ఇటీవలే శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పాతుమ్ నిశాంక, వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేశారు. నిశాంక ప్రస్తుతం 8వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.(hindustan times)
వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 56వ స్థానంలో ఉన్నాడు.
(10 / 11)
వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 56వ స్థానంలో ఉన్నాడు.(hindustan times)
టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడి ఎవరో తెలుసా?
(11 / 11)
టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడి ఎవరో తెలుసా?

    ఆర్టికల్ షేర్ చేయండి