తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rishabh Pant Birthday: ఈ విషయంలో ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషభ్ పంత్.. ఏంటంటే?

Rishabh Pant Birthday: ఈ విషయంలో ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషభ్ పంత్.. ఏంటంటే?

04 October 2022, 17:50 IST

Rishabh Pant Birthday Special: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 25వ పుట్టిన రోజు నేడు. ఈ స్టార్ ప్లేయర్ భారత జట్టులో కీలక ఆటగాడుగానే కాకుండా.. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియాను కీలక ఆటగాడిగా ఉన్న ఇతడు.. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

  • Rishabh Pant Birthday Special: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 25వ పుట్టిన రోజు నేడు. ఈ స్టార్ ప్లేయర్ భారత జట్టులో కీలక ఆటగాడుగానే కాకుండా.. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియాను కీలక ఆటగాడిగా ఉన్న ఇతడు.. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
నేడు రిషభ్ పంత్ 25వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పంత్.. టీమిండియాలో అతడి ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో పంత్ ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‍‌కొచ్చే సరికి అతడు అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
(1 / 9)

టెస్టు క్రికెట్‌లో పంత్ టీమిండియాకు తరచూ ట్రబుల్ షూటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు 31 టెస్టులాడిన పంత్.. 5 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. వీటిల్లో3 సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా(SENA) లాంటి అగ్రస్థాయి జట్లపై చేయడం విశేషం. ఇక్కడ ఆశ్చర్యకర విశేషమేమంటే ధోనీ తన 90 టెస్టు మ్యాచ్ కెరీర్‌లో ఈ జట్లపై ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.
(2 / 9)

2018లో ఇంగ్లాండ్‌పై రిషభ్ పంత్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 114 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.
(3 / 9)

ఆ తర్వాత 2019లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్‌లో పంత్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో అతడు 159 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా మ్యాచ్ డ్రాగా మారి సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
(4 / 9)

దక్షిణాఫ్రికాతో పంత్ మూడో సెంచరీ నమోదు చేశాడు. 2022లో ఆఫ్రికాపై పంత్ 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అయితే న్యూజిలాండ్‌లో పంత్ ఇంకా సెంచరీ చేయలేదు.
(5 / 9)

దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన ఏకైక భారత వికెట్ కీపర బ్యాటర్ పంత్ కావడం విశేషం. అలాగే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ మూడు దేశాల్లో సెంచరీ ఏకైక భారత వికెట్ కీపర్ బ్యాటర్ కూడా ఇతడే.
(6 / 9)

2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 11 క్యాచ్‌లతో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు.
(7 / 9)

ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదిన ఏకైక భారత వికెట్ కీపర్ కూడా రిషభ్ పంతే. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ కూడా ఇతడే.
(8 / 9)

ఈ రికార్డుల్లో ధోనీని అధిగమించిన పంత్
(9 / 9)
ఈ రికార్డుల్లో ధోనీని అధిగమించిన పంత్(all photo- Rishab Pant instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి