తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Is How To Take Care Of Your Skin After 30 Follow This Tips

Skin Care After 30:ముడతలు లేని చర్మం కావాలా? ఈ 5 ఆహారాలను రోజూ తినండి

21 August 2022, 15:48 IST

మీరు రోజువారిగా తీసుకునే ఆహారం మీ శరీరంపై ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, మీ చర్మం అంత మెరుగ్గా ఉంటుంది.

  • మీరు రోజువారిగా తీసుకునే ఆహారం మీ శరీరంపై ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, మీ చర్మం అంత మెరుగ్గా ఉంటుంది.
స్మూత్ స్కిన్ పొందడానికి మనమందరం రకరకాల ఖరీదైన క్రీమ్స్ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తాం. కానీ 30 ఏళ్ల తర్వాత చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఖరీదైన వస్తువులను ఉపయోగించడం మాత్రమే కాదు, ఆహారంపై కూడా శ్రద్ధ చూపడం అవసరం. మీ రోజువారీ మెనూలో ఏ ఆహారాలు ఉంచాలో తెలుసుకోండి
(1 / 5)

కొల్లాజెన్ అనేది చర్మాన్ని ఆరోగ్యంగా, ముడతలు లేకుండా దృఢంగా ఉంచడంలో సహాయపడే ప్రోటీన్. శరీరంలో కొల్లాజెన్ స్థాయిలను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు మీ ఆహారంలో కొల్లాజెన్ సప్లిమెంట్స్ లేదా ఎముకల పులుసు (మీరు మాంసాహారాలు అయితేనే) చేర్చుకోవాలి. ఎముకల పులుసులో ఉండే క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
(2 / 5)

విటమిన్ సి పుష్కలంగా ఉండే బచ్చలికూర వంటి కూరగాయలు చర్మాన్ని కాలుష్యం, సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. బెల్ పెప్పర్స్, టమోటాలలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో కూడా తీసుకోండి.
(3 / 5)

పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉండే దాల్చిన చెక్క పొడి మీ చర్మం ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి దాల్చిన చెక్క పొడిని ఆహారంలో చేర్చండి. మీరు దాల్చినచెక్కతో డిటాక్స్ నీటిని కూడా తయారు చేసుకోవచ్చు.
(4 / 5)

మన శరీరానికి కొవ్వు చాలా ముఖ్యం. తీసుకునే కొవ్వులో హెల్తీ కొలెస్ట్రాల్ ఉండాలి. కాబట్టి చేపలు, ఆలివ్ ఆయిల్, అవకాడో, చియా సీడ్స్, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నెయ్యి రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి