తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tallest Statues । ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలు ఇవే.. టాప్ 5లో రెండు మనవే!

Tallest Statues । ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలు ఇవే.. టాప్ 5లో రెండు మనవే!

02 February 2023, 19:13 IST

Tallest Statues: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ ఇండియా నుండి చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ వరకు, ప్రపంచంలోని మొదటి ఐదు ఎత్తైన విగ్రహాలు ఇక్కడ చూడండి.

  • Tallest Statues: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ ఇండియా నుండి చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ వరకు, ప్రపంచంలోని మొదటి ఐదు ఎత్తైన విగ్రహాలు ఇక్కడ చూడండి.
భక్తి భావం, అభిమానం తెలియజెప్పెందుకు, సంస్కృతి, శిల్పకళ చాటేందుకు, చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనల స్మరణకు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. పురాతన కాలం నుండి ఎత్తైన విగ్రహాలను నిర్మించడం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో చాలా ఎత్తైన విగ్రహాలు ఏవో చూడండి మరి
(1 / 6)
భక్తి భావం, అభిమానం తెలియజెప్పెందుకు, సంస్కృతి, శిల్పకళ చాటేందుకు, చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనల స్మరణకు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. పురాతన కాలం నుండి ఎత్తైన విగ్రహాలను నిర్మించడం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో చాలా ఎత్తైన విగ్రహాలు ఏవో చూడండి మరి(File Photos)
స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఇండియా (182 మీ): భారతదేశంలోని గుజరాత్‌లోని కెవాడియా సమీపంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహం భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితం ఇచ్చినది.  
(2 / 6)
స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఇండియా (182 మీ): భారతదేశంలోని గుజరాత్‌లోని కెవాడియా సమీపంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహం భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితం ఇచ్చినది.  (HT Photo)
స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, చైనా (128 మీ): చైనాలోని హెనాన్‌లోని లుషాన్ కౌంటీలోని జాకున్ టౌన్‌షిప్‌లో ఉన్న ఇది వైరోకానా బుద్ధుని వర్ణించే భారీ విగ్రహం.  1997 నుండి 2008 వరకు 11 ఏళ్లు దీని నిర్మాణం జరిగింది.
(3 / 6)
స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, చైనా (128 మీ): చైనాలోని హెనాన్‌లోని లుషాన్ కౌంటీలోని జాకున్ టౌన్‌షిప్‌లో ఉన్న ఇది వైరోకానా బుద్ధుని వర్ణించే భారీ విగ్రహం.  1997 నుండి 2008 వరకు 11 ఏళ్లు దీని నిర్మాణం జరిగింది.(Instagram/@go_with__me)
లేక్యున్ సెక్క్యా, మయన్మార్ (115.8 మీ): నిలబడి ఉన్న ఈ  బుద్ధ విగ్రహం 115 మీటర్ల ఎత్తు ఉన్న ప్రపంచంలోనే మూడవ ఎత్తైన విగ్రహం. ఇది మయన్మార్‌లోని మోనీవా సమీపంలోని ఖటకాన్ తౌంగ్ గ్రామంలో ఉంది.  
(4 / 6)
లేక్యున్ సెక్క్యా, మయన్మార్ (115.8 మీ): నిలబడి ఉన్న ఈ  బుద్ధ విగ్రహం 115 మీటర్ల ఎత్తు ఉన్న ప్రపంచంలోనే మూడవ ఎత్తైన విగ్రహం. ఇది మయన్మార్‌లోని మోనీవా సమీపంలోని ఖటకాన్ తౌంగ్ గ్రామంలో ఉంది.  (Instagram/@lodggy)
బర్త్ ఆఫ్ ది న్యూ వరల్డ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (110 మీ):  360-అడుగుల (110 మీ) ఈ కాంస్య శిల్పం, క్రిస్టోఫర్ కొలంబస్‌ను చిత్రీకరిస్తుంది, ఇది ప్యూర్టో రికోలోని అరేసిబోలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉంది.
(5 / 6)
బర్త్ ఆఫ్ ది న్యూ వరల్డ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (110 మీ):  360-అడుగుల (110 మీ) ఈ కాంస్య శిల్పం, క్రిస్టోఫర్ కొలంబస్‌ను చిత్రీకరిస్తుంది, ఇది ప్యూర్టో రికోలోని అరేసిబోలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉంది.(Instagram/@dannas.trail.of.turquoise)
స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్, ఇండియా (107): రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో ఉన్న ఈ విగ్రహం, నమ్మకానికి ప్రతీక లేదా విశ్వాస స్వరూపంగా ఏర్పాటు చేశారు. ఇది హిందూ దేవుడైన శివుని విగ్రహం. ఇది ప్రపంచంలోనే ఐదవ ఎత్తైన విగ్రహం కాగా, ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఇదే.
(6 / 6)
స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్, ఇండియా (107): రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో ఉన్న ఈ విగ్రహం, నమ్మకానికి ప్రతీక లేదా విశ్వాస స్వరూపంగా ఏర్పాటు చేశారు. ఇది హిందూ దేవుడైన శివుని విగ్రహం. ఇది ప్రపంచంలోనే ఐదవ ఎత్తైన విగ్రహం కాగా, ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఇదే.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి