తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  జ్యేష్ట పూర్ణిమ రోజున ఇలా చేస్తే ఆర్థికంగా కలిసొస్తుంది

జ్యేష్ట పూర్ణిమ రోజున ఇలా చేస్తే ఆర్థికంగా కలిసొస్తుంది

02 June 2023, 11:00 IST

Jyeshta purnima 2023: జూన్ 4న జ్యేష్ట పూర్ణిమ వ్రతం పాటించనున్నారు. ఈ రోజున కొన్ని పరిహారాలతో ఆర్థికంగా కలిసొస్తుందని పెద్దల మాట.

  • Jyeshta purnima 2023: జూన్ 4న జ్యేష్ట పూర్ణిమ వ్రతం పాటించనున్నారు. ఈ రోజున కొన్ని పరిహారాలతో ఆర్థికంగా కలిసొస్తుందని పెద్దల మాట.
జ్యేష్ట మాసంలో వచ్చే పౌర్ణమికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజున అన్నదానం చేయడాన్ని అత్యంత పుణ్య కార్యంగా భావిస్తారు. ఈ రోజు నదీ స్నానాలు చేస్తారు. ఈసారి జ్యేష్ట పూర్ణిమ వ్రతాన్ని జూన్ 4 ఆదివారం జరుపుకోనున్నారు. 
(1 / 7)

జ్యేష్ట పూర్ణిమ రోజున రావి వృక్షాన్ని పూజించాలి. ఇక్కడ విష్ణువు సమేతంగా లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఈ రోజు గ్లాసులో పచ్చి పాలు, నీళ్లు కలిపి రావి చెట్టుకు నైవేద్యంగా పెడితే సిరిసంపదలు కురుస్తాయి. ఈ పరిహారం చేయడం వల్ల వ్యాపారానికి కూడా లాభం చేకూరుతుంది.
(2 / 7)

వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే ఈ రోజున చంద్రదేవునికి భార్యాభర్తలు పాలు సమర్పించాలి. ఇది వారి జీవితంలోని సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ పని చేయవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల వైవాహిక జీవితంలో శాంతి లభిస్తుంది. 
(3 / 7)

ఏ పని చేపట్టినా విఫలమవుతుంటే ఈ రోజున ఒక బావిలో పాలు పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. ఏదైనా ముఖ్యమైన పనిలో అడ్డంకులు ఏర్పడితే ఈ పరిహారం వల్ల ఆటంకాలు తొలగుతాయి.
(4 / 7)
ఏ పని చేపట్టినా విఫలమవుతుంటే ఈ రోజున ఒక బావిలో పాలు పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. ఏదైనా ముఖ్యమైన పనిలో అడ్డంకులు ఏర్పడితే ఈ పరిహారం వల్ల ఆటంకాలు తొలగుతాయి.(Freepik)
జన్మరాశిలో గ్రహదోషం ఉన్నట్లయితే, ఈ రోజున రావి చెట్టు, వేప చెట్టు క్రింద విష్ణు సహస్తక లేదా శివాష్టక పారాయణం చేయండి. దీని ద్వారా గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. 
(5 / 7)

జ్యేష్ట పూర్ణిమ రోజున మా లక్ష్మి చిత్రం ముందు 11 పైసలు నివేదించి పసుపు తిలకం పూయాలి. మరుసటి రోజు ఉదయం ఆ డబ్బును ఎర్రటి గుడ్డలో కట్టి లాకర్‌లో ఉంచండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
(6 / 7)

మిగతా నెలలతో పోలిస్తే ఈ మాసంలో నీటి ప్రాధాన్యత పెరుగుతుంది. జ్యేష్ట పూర్ణిమ రోజున తెల్లని వస్త్రం, పంచదార, అన్నం, పెరుగు, వెండి వస్తువులు, ముత్యాలు దానం చేయడం వల్ల కుండలిలో చంద్రుని స్థానం మెరుగుపడుతుంది. 
(7 / 7)
మిగతా నెలలతో పోలిస్తే ఈ మాసంలో నీటి ప్రాధాన్యత పెరుగుతుంది. జ్యేష్ట పూర్ణిమ రోజున తెల్లని వస్త్రం, పంచదార, అన్నం, పెరుగు, వెండి వస్తువులు, ముత్యాలు దానం చేయడం వల్ల కుండలిలో చంద్రుని స్థానం మెరుగుపడుతుంది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి