తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Diabetes Facts From Ayurveda Know Eating Mistakes That Increase Blood Sugar Level

డయాబెటిస్ ఉన్నా ఈ ఆహార అలవాట్లేనా? ఆయుర్వేదం ఎందుకు నిషేధించిందో తెలుసా?

29 May 2023, 9:00 IST

మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం చేటు చేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

  • మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం చేటు చేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
మీకు డయాబెటిస్ ఉంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని రోజూ తింటే మధుమేహాన్ని ఇంకా పెంచుకున్నట్టే. వీటి గురించి ఆయుర్వేదం ఏమి చెబుతుందో తెలుసుకోండి.
(1 / 5)
మీకు డయాబెటిస్ ఉంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని రోజూ తింటే మధుమేహాన్ని ఇంకా పెంచుకున్నట్టే. వీటి గురించి ఆయుర్వేదం ఏమి చెబుతుందో తెలుసుకోండి.(Freepik)
అతిగా పెరుగు తినడం: చాలా మంది మధుమేహ రోగులు రోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు. మితంగా తినడం మంచిదే. అతిగా తింటే బరువు పెరుగుతారు. జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది. ఇది డయాబెటిస్‌కు ముప్పుగా పరిణిమిస్తుంది.
(2 / 5)
అతిగా పెరుగు తినడం: చాలా మంది మధుమేహ రోగులు రోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు. మితంగా తినడం మంచిదే. అతిగా తింటే బరువు పెరుగుతారు. జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది. ఇది డయాబెటిస్‌కు ముప్పుగా పరిణిమిస్తుంది.(Freepik)
భారీ డిన్నర్: రాత్రిపూట ఆలస్యంగా తినడం, పొట్ట పగిలేలా భోజనం చేయడం చాలా మందికి ఉండే రెండు అలవాట్లు. ఇవి జీవక్రియ రేటును తగ్గిస్తాయి. కాలేయంపై ఒత్తిడి పడేలా చేస్తాయి. ఇది డయాబెటిక్ రోగుల్లో పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.
(3 / 5)
భారీ డిన్నర్: రాత్రిపూట ఆలస్యంగా తినడం, పొట్ట పగిలేలా భోజనం చేయడం చాలా మందికి ఉండే రెండు అలవాట్లు. ఇవి జీవక్రియ రేటును తగ్గిస్తాయి. కాలేయంపై ఒత్తిడి పడేలా చేస్తాయి. ఇది డయాబెటిక్ రోగుల్లో పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.(Freepik)
అతిగా తినడం: కొన్నిసార్లు ఆకలితో అతిగా తినడం మనం చేసే పొరపాటు. ఇది ఆహారం యొక్క స్వభావాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిని విపరీతంగా పెంచేస్తుంది. అందుకే మితాహారం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.
(4 / 5)
అతిగా తినడం: కొన్నిసార్లు ఆకలితో అతిగా తినడం మనం చేసే పొరపాటు. ఇది ఆహారం యొక్క స్వభావాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిని విపరీతంగా పెంచేస్తుంది. అందుకే మితాహారం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.(Freepik)
తరచుగా తినడం: చాలా మంది ఆకలిగా లేనప్పుడు కూడా తరచుగా ఆహారం తీసుకుంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల మధుమేహం సమస్య కూడా పెరుగుతుంది. ఆకలి వేసినప్పుడు మితంగా, అది కూడా పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది.
(5 / 5)
తరచుగా తినడం: చాలా మంది ఆకలిగా లేనప్పుడు కూడా తరచుగా ఆహారం తీసుకుంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల మధుమేహం సమస్య కూడా పెరుగుతుంది. ఆకలి వేసినప్పుడు మితంగా, అది కూడా పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి