తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Deepotsavam In Vijayawada Kanaka Durga Temple

Deepotsavam In Pics : వైభవం.. కోటి కాంతుల దీపోత్సవం

08 November 2022, 9:44 IST

విజయవాడ కనకదుర్గ ఆలయంలో, టీటీడీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా యాగంటి పుణ్య క్షేత్రంలో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు.. దీప కాంతుల్లో వెలిగిపోయాయి.

  • విజయవాడ కనకదుర్గ ఆలయంలో, టీటీడీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా యాగంటి పుణ్య క్షేత్రంలో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు.. దీప కాంతుల్లో వెలిగిపోయాయి.
తిరుమతిరుమల శ్రీవారి ఆధ్వర్యంలో, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.ల శ్రీవారి ఆధ్వర్యంలో, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
(1 / 11)

దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ప్రారంభించారు.
(2 / 11)

అనంతరం వీరు చిన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన జ్వాళాతోరణం వద్ద ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, జ్వాలా తోరణం వెలిగించారు.
(3 / 11)

కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం మరియు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
(4 / 11)

దుర్గమ్మ సన్నిధిలో కన్నుల పండువగా దీపోత్సవం సాగింది.
(5 / 11)
దుర్గమ్మ సన్నిధిలో కన్నుల పండువగా దీపోత్సవం సాగింది.
నంద్యాల జిల్లా యాగంటి పుణ్య క్షేత్రంలో సోమవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
(6 / 11)

వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక దీపారాధన చేశారు.
(7 / 11)
వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక దీపారాధన చేశారు.
కార్తీక మహా దీపోత్సవం ద్వారా ప్రజలకు ఆయురారోగ్యాలు లభించి, దేశం సుభిక్షంగా ఉంటుందని అనేక పురాణాలు చెప్పాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
(8 / 11)

టీటీడీ ప్రతి ఏడాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో  సామూహిక కార్తీక దీపోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు.
(9 / 11)

యాగంటి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు. పండితులు కోగంటి రామానుజాచార్యులు స్వాగతం, సందర్భ పరిచయం చేశారు.
(10 / 11)

తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా శ్రీవారి తిరువారాధన నిర్వహించారు.  పండితులు విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేశారు. అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆకట్టుకునేలా నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి