తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kashmir Winter: గడ్డకట్టిన అందాల ‘దాల్ సరస్సు’.. శ్రీనగర్‌లో మైనస్ 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత: ఫొటోలు

Kashmir Winter: గడ్డకట్టిన అందాల ‘దాల్ సరస్సు’.. శ్రీనగర్‌లో మైనస్ 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత: ఫొటోలు

05 January 2023, 15:26 IST

Jammu Kashmir - Winter: జమ్ము కశ్మీర్‌లో చలికాలం తీవ్రమైంది. ఆ ప్రాంతంలో అత్యంత శీతలమైన రోజులు ఇవి. శ్రీనగర్‌లో ఏకంగా మైనస్ 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రసిద్ధ ‘దాల్ సరస్సు’ (Dal Lake)లోని కొన్ని భాగాలు గడ్డకట్టుకుపోయాయి. నీరు.. మంచుగడ్డలా మారింది. కాజిగండ్‍లో మైనస్ 6.2 డిగ్రీలు, కుప్వారాలో మైనస్ 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా అందాల కశ్మీరం చలి గుప్పిట్లో ఉంది.

ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి.. అత్యంత శీతల వాతావరణం ఏర్పడటంతో జమ్ము కశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సు గడ్డకట్టుకుపోయింది. 
(1 / 5)
ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి.. అత్యంత శీతల వాతావరణం ఏర్పడటంతో జమ్ము కశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సు గడ్డకట్టుకుపోయింది. (Waseem Andrabi /Hindustan Times)
శ్రీనగర్‌లో గురువారం మైనస్ 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శీతల గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది.
(2 / 5)
శ్రీనగర్‌లో గురువారం మైనస్ 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శీతల గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది.(Waseem Andrabi /Hindustan Times)
శ్రీనగర్‌లో మైనస్ 6.4 డిగ్రీలు, క్వాజిగండ్‍లో మైనస్ 6.2 డిగ్రీలు, కుప్వారాలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలితీవ్రంగా ఉంది. 
(3 / 5)
శ్రీనగర్‌లో మైనస్ 6.4 డిగ్రీలు, క్వాజిగండ్‍లో మైనస్ 6.2 డిగ్రీలు, కుప్వారాలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలితీవ్రంగా ఉంది. (Waseem Andrabi /Hindustan Times)
శ్రీనగర్‌లో మంచు కూడా ఎక్కువగా కురుస్తోంది. ఓ టూ వీలర్‌పై మంచు పడిన దృశ్యమిది.
(4 / 5)
శ్రీనగర్‌లో మంచు కూడా ఎక్కువగా కురుస్తోంది. ఓ టూ వీలర్‌పై మంచు పడిన దృశ్యమిది.(Waseem Andrabi /Hindustan Times)
రానున్న రోజుల్లో జమ్ము కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని మేం అంచనా వేస్తున్నాం. 6వ తేదీ వరకు రాత్రి వేళ్లలో తీవ్రమైన చలి ఉంటుంది" అని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముక్తార్ అహ్మద్ వెల్లడించారు. 
(5 / 5)
రానున్న రోజుల్లో జమ్ము కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని మేం అంచనా వేస్తున్నాం. 6వ తేదీ వరకు రాత్రి వేళ్లలో తీవ్రమైన చలి ఉంటుంది" అని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముక్తార్ అహ్మద్ వెల్లడించారు. (Waseem Andrabi /Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి