తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wedding Destinations: తక్కువ బడ్జెట్ లో డెస్టినేషన్ పెళ్లికి సరైన ప్రదేశాలివే..

wedding destinations: తక్కువ బడ్జెట్ లో డెస్టినేషన్ పెళ్లికి సరైన ప్రదేశాలివే..

01 May 2023, 12:05 IST

wedding destinations: డెస్టినేషన్ పెళ్లిళ్లకు, కనువిందైన లొకేషన్స్ కోసం, ఫోటోలకు కావాల్సిన ప్రకృతి అందాలకోసం తక్కువ ఖర్చులో ఎంచుకోదగ్గ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే..

wedding destinations: డెస్టినేషన్ పెళ్లిళ్లకు, కనువిందైన లొకేషన్స్ కోసం, ఫోటోలకు కావాల్సిన ప్రకృతి అందాలకోసం తక్కువ ఖర్చులో ఎంచుకోదగ్గ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే..
వేల కొద్దీ అతిథుల మధ్య జరిగే ఆడంబరమైన పెళ్లిళ్లకు లెక్కలేదు. వాటి ఖర్చు కూడా భారీగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం తక్కువ మంది అతిథులతో దూర ప్రాంతాల్లో పెళ్లిళ్లకి ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిలో జైపూర్, ఉదయ్‌పూర్, రాజస్థాన్ లాంటి వాటికి చాలా ఆదరణ ఉంది. కానీ తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేయాలనుకుంటే కొన్ని ప్రాంతాల గురించి తెలుసుకోండి. 
(1 / 5)
వేల కొద్దీ అతిథుల మధ్య జరిగే ఆడంబరమైన పెళ్లిళ్లకు లెక్కలేదు. వాటి ఖర్చు కూడా భారీగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం తక్కువ మంది అతిథులతో దూర ప్రాంతాల్లో పెళ్లిళ్లకి ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిలో జైపూర్, ఉదయ్‌పూర్, రాజస్థాన్ లాంటి వాటికి చాలా ఆదరణ ఉంది. కానీ తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేయాలనుకుంటే కొన్ని ప్రాంతాల గురించి తెలుసుకోండి. (Unsplash)
ఖజురహో:  ఆ పేరులోనే ఏదో తెలియని ఠీవీ ఉంది. మధ్య ప్రదేశ్ లో ఉన్న ఈ ప్రదేశం శిల్పసంపదకు, మందిరాలకు ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకోవడం మంచి ఎన్నికే అవుతుంది. ఒక ప్రత్యేక అనుభవంగా నిలిచిపోతుంది. 
(2 / 5)
ఖజురహో:  ఆ పేరులోనే ఏదో తెలియని ఠీవీ ఉంది. మధ్య ప్రదేశ్ లో ఉన్న ఈ ప్రదేశం శిల్పసంపదకు, మందిరాలకు ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకోవడం మంచి ఎన్నికే అవుతుంది. ఒక ప్రత్యేక అనుభవంగా నిలిచిపోతుంది. (File Photo)
హ్యావెలాక్ ఐల్యాండ్: అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందీ హ్యావెలాక్ ఐల్యాండ్. దట్టమైన అడవులు, తెలుపు రంగు ఇసుకతో మెరిసిపోయే సముద్ర తీరాలు, స్వచ్ఛంగా నీలి రంగులో ఉండే నీళ్లు పెళ్లిళ్లకి అద్భుతమైన చోటు. సాగరతీరంలో డెస్టినేషన్ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇంతకన్నా మంచి చోటుండదు. 
(3 / 5)
హ్యావెలాక్ ఐల్యాండ్: అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందీ హ్యావెలాక్ ఐల్యాండ్. దట్టమైన అడవులు, తెలుపు రంగు ఇసుకతో మెరిసిపోయే సముద్ర తీరాలు, స్వచ్ఛంగా నీలి రంగులో ఉండే నీళ్లు పెళ్లిళ్లకి అద్భుతమైన చోటు. సాగరతీరంలో డెస్టినేషన్ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇంతకన్నా మంచి చోటుండదు. (Instagram/@landscapeanindya)
స్పితి లోయ: హిమాచల్ ప్రదేశ్ లో ఉందీ స్పితి లోయ.  కాస్త విభిన్నమైన ప్రక‌ృతి అందాలతో చూడచక్కని ప్రదేశం ఇది. ఇక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. పాతకాలం నాటి గుళ్లు, సాంప్రదాయ గ్రామాలకు ఇది పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో పెళ్లికి అయ్యే ఖర్చూ తక్కువే. 
(4 / 5)
స్పితి లోయ: హిమాచల్ ప్రదేశ్ లో ఉందీ స్పితి లోయ.  కాస్త విభిన్నమైన ప్రక‌ృతి అందాలతో చూడచక్కని ప్రదేశం ఇది. ఇక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. పాతకాలం నాటి గుళ్లు, సాంప్రదాయ గ్రామాలకు ఇది పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో పెళ్లికి అయ్యే ఖర్చూ తక్కువే. (Instagram/@kasolhills)
తవాంగ్: సుందరమైన ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. మంచు కప్పి ఉన్న పర్వతాలు, పాత కాలం నాటి మందిరాలు ఎన్నో ఉంటాయిక్కడ. పెళ్లిళ్లకు సరిపోయే సుందర ప్రదేశం ఇది. 
(5 / 5)
తవాంగ్: సుందరమైన ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. మంచు కప్పి ఉన్న పర్వతాలు, పాత కాలం నాటి మందిరాలు ఎన్నో ఉంటాయిక్కడ. పెళ్లిళ్లకు సరిపోయే సుందర ప్రదేశం ఇది. (File Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి