తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Buddha Purnima 2023: బుద్ధ పూర్ణిమ రోజు వీక్షించదగ్గ బౌద్ధ క్షేత్రాలివే..

Buddha Purnima 2023: బుద్ధ పూర్ణిమ రోజు వీక్షించదగ్గ బౌద్ధ క్షేత్రాలివే..

04 May 2023, 16:40 IST

Buddha Purnima 2023: మహాబోధి మందిరం నుంచి సాంచీ స్తూపం వరకు బుద్ధునికి సంబంధించిన కొన్ని ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. అవేంటో చూడండి. 

Buddha Purnima 2023: మహాబోధి మందిరం నుంచి సాంచీ స్తూపం వరకు బుద్ధునికి సంబంధించిన కొన్ని ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. అవేంటో చూడండి. 
బుద్ధ పూర్ణిమను బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది బౌద్ధ క్యాలెండర్‌లో ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇది బుద్ధ భగవానుడి జననం, జ్ఞానోదయం గురించి గుర్తు చేస్తుంది.  ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునేవారికి  భారతదేశం అనేక పురాతన బౌద్ధ ఆరామాలు మరియు దేవాలయాలకు నిలయంగా ఉంది. ఇవి బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి తెలియజేస్తాయి. అలాంటి ప్రదేశాలేంటో చూద్దాం. 
(1 / 7)
బుద్ధ పూర్ణిమను బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది బౌద్ధ క్యాలెండర్‌లో ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇది బుద్ధ భగవానుడి జననం, జ్ఞానోదయం గురించి గుర్తు చేస్తుంది.  ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునేవారికి  భారతదేశం అనేక పురాతన బౌద్ధ ఆరామాలు మరియు దేవాలయాలకు నిలయంగా ఉంది. ఇవి బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి తెలియజేస్తాయి. అలాంటి ప్రదేశాలేంటో చూద్దాం. (Shutterstock)
మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, బుద్ధ గయ: బౌద్ధ మతం పుట్టింది ఇక్కడే. ఈ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షానికి ఇది ప్రతీతి.  
(2 / 7)
మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, బుద్ధ గయ: బౌద్ధ మతం పుట్టింది ఇక్కడే. ఈ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షానికి ఇది ప్రతీతి.  (File photo)
సాంచి స్తూపం, మధ్యప్రదేశ్: క్రీ.పూ 3 వ శతాబ్దం నాటి అద్భుతమైన బౌద్ధ స్మారక చిహ్నం ఇది.  గొప్ప శిల్పసంపదకు కూడా ప్రసిద్ధి. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. 
(3 / 7)
సాంచి స్తూపం, మధ్యప్రదేశ్: క్రీ.పూ 3 వ శతాబ్దం నాటి అద్భుతమైన బౌద్ధ స్మారక చిహ్నం ఇది.  గొప్ప శిల్పసంపదకు కూడా ప్రసిద్ధి. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. (pixabay)
హెమిస్ మొనాస్టరీ, లడఖ్: ఇది లడఖ్‌లోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ మొనాస్టరీలలో ఒకటి. రంగులమయమైన ఆకర్షణీయమైన పండుగలకు, బుద్ధుని కళాఖండాలకు ఇది ప్రసిద్ధి.  
(4 / 7)
హెమిస్ మొనాస్టరీ, లడఖ్: ఇది లడఖ్‌లోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ మొనాస్టరీలలో ఒకటి. రంగులమయమైన ఆకర్షణీయమైన పండుగలకు, బుద్ధుని కళాఖండాలకు ఇది ప్రసిద్ధి.  (Pinterest)
తవాంగ్ మొనాస్టరీ, అరుణాచల్ ప్రదేశం: ఇది భారతదేశంలోని బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో అతి పెద్దది. ఇక్కడ బుద్ధుని బంగారు విగ్రహం ఉంది. పురాతన గ్రంథాలు, చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యానికి ఇది ప్రసిద్ధి. 
(5 / 7)
తవాంగ్ మొనాస్టరీ, అరుణాచల్ ప్రదేశం: ఇది భారతదేశంలోని బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో అతి పెద్దది. ఇక్కడ బుద్ధుని బంగారు విగ్రహం ఉంది. పురాతన గ్రంథాలు, చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యానికి ఇది ప్రసిద్ధి. (Rahul Karmakar/HT Photo)
అజంతా గుహలు, మహారాష్ట్ర: ఇది కూడా యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటి. ఈ గుహల్లో రాతిమీద చెక్కిన అద్భుతమైన బుద్ధుని బొమ్మలున్నాయి. బుద్ధుని జీవితం గురించి తెలియజేసే శిల్పాలు ఇక్కడున్నాయి. 
(6 / 7)
అజంతా గుహలు, మహారాష్ట్ర: ఇది కూడా యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటి. ఈ గుహల్లో రాతిమీద చెక్కిన అద్భుతమైన బుద్ధుని బొమ్మలున్నాయి. బుద్ధుని జీవితం గురించి తెలియజేసే శిల్పాలు ఇక్కడున్నాయి. (Ajay Aggarwal / HT Photo)
ధమేకా స్తూపం, సారనాథ్: ధమేకా స్తూపం ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ లో ఉంది. బుద్ధపూర్ణిమ సమయంలో సందర్శించడానికి బౌద్ధులకు ఇది మంచి చారిత్రాత్మక, ఆద్యాత్మిక ప్రదేశం. ఇక్కడ అనేక ఏళ్లనాటి కట్టడ శిథిలాలు కూడా కనిపిస్తాయి.
(7 / 7)
ధమేకా స్తూపం, సారనాథ్: ధమేకా స్తూపం ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ లో ఉంది. బుద్ధపూర్ణిమ సమయంలో సందర్శించడానికి బౌద్ధులకు ఇది మంచి చారిత్రాత్మక, ఆద్యాత్మిక ప్రదేశం. ఇక్కడ అనేక ఏళ్లనాటి కట్టడ శిథిలాలు కూడా కనిపిస్తాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి