తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Student Loan : చదువు కోసం లోన్​ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి

Student loan : చదువు కోసం లోన్​ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి

23 March 2023, 11:18 IST

Hidden charges in student loan : మీరు చదువు కోసం ఒక స్టూడెంట్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? దాని కన్నా ముందు.. మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఛార్జీల మోత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. జ్ఞాన్​ధాన్​ సీఈఓ అంకిత్​ మెహ్రా మాటల్లో వాటి గురించి తెలుసుకుందాము..

ప్రాసెసింగ్​ ఫీజ్​:- ఎడ్జ్యుకేషన్​ లోన్ ప్రాసెస్​​ కోసం బ్యాంక్​లు ఈ ప్రాసెసింగ్​ ఫీజ్​ను ఛార్జ్​ చేస్తాయి. ఇది సాధారణమైన విషయం. ఇది ఫిక్స్​డ్​ అమౌంట్​ ఉండొచ్చు, లేదా లోన్​ అమౌంట్​లో పర్సెంటేజ్​ కింద ఉండొచ్చు. అయితే.. కొంతమంది ప్రాసెసింగ్​ ఫీజ్​తో పాటు సర్వీస్​ ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటారు.
(1 / 7)

ప్రీపేమెంట్​ ఛార్జెస్​:- తీసుకున్న లోన్​ను నిర్ణిత సమయం కన్నా ముందే చెల్లించేస్తుంటే.. ప్రీపేమెంట్​ ఛార్జీలు వసూలు చేస్తారు. ఎడ్జ్యుకేషన్​ లోన్​లో సాధారణంగా ఇలాంటివి ఉండవు. కానీ టర్మ్స్​ అండ్​ కండీషన్​లను ఓసారి చూసుకుంటే మంచిది. 
(2 / 7)

లేట్​ పేమెంట్​:- ఈఎంఐలను సకాలంలో కట్టకపోయినా అదనపు ఛార్జీలు వేస్తుంటారు. ఇది ఈఎంఐ + జీఎస్​టీ అమౌంట్​లో 2-3శాతం ఉంటుంది. 
(3 / 7)

లోన్​ ఇన్​ష్యూరెన్స్​:- అనుకోని సందర్భాల్లో లోన్​ని తీర్చలేకపోతుంటే.. ఈ బీమా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో ఇది కూడా సాధారణమైపోయింది. అయితే.. ఇది లేకపోతే అదనపు వడ్డీలు పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బ్యాంక్​లలో ఈ వడ్డీ 0.05-0.25శాతం ఉండగా.. ప్రైవేటు బ్యాంక్​లలో 2శాతం వరకు ఉండొచ్చు. 
(4 / 7)

మార్టిగేజ్​ క్రియేషన్​ ఛార్జెస్​:- కొలాటరల్​ మీద ఎడ్జ్యూకేషన్​ లోన్​ తీసుకుంటే.. ఈ ఛార్జీలు వేస్తారు. లోన్​ అమౌంట్​లో ఇది 0.25- 0.3శాతం ఉండొచ్చు. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఛార్జీలను ప్రభుత్వాలు ఎత్తివేశాయి. 
(5 / 7)

ప్రాపర్టీ ఇన్​ష్యూరెన్స్​:- లోన్​ తీసుకునేటప్పుడు ఏదైనా పాత ప్రాపర్టీని హామీగా పెడుతుంటే.. దానిపై ప్రాపర్టీ ఇన్​ష్యూరెన్స్​ను విధిస్తున్నాయి బ్యాంక్​లు.  
(6 / 7)

సప్లిమెంటరీ ఇన్​ష్యూరెన్స్​:- లోన్​ తీసుకునేటప్పుడే.. సంబంధిత వ్యక్తులకు హెల్త్​, ట్రావెల్​ వంటి ఇన్​ష్యూరెన్స్​లను తీసుకోవాలని బ్యాంక్​లు చెబుతుంటాయి. కచ్చితంగా తీసుకోవాలి అని ఏం లేదు. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి