తెలుగు న్యూస్  /  Video Gallery  /  Yediyurappa Helicopter Accident

Yediyurappa's helicopter accident| ప్రమాదం నుంచి తప్పించుకున్న యడియూరప్ప

06 March 2023, 19:34 IST

  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. నేడు బెంగళూరు నుంచి యడియూరప్ప హెలీక్యాప్టర్ లో కాలబుర్గికి వెళ్లారు. ఆయన ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ కాలాబుర్గి చేరుకుని హెలీప్యాడ్ వద్ద ల్యాండింగ్ అవుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. హెలీక్యాప్టర్ రెక్కల గాలి తాకిడికి హెలీప్యాడ్ చుట్టూ పేరుకుపోయి ఉన్న ప్లాస్టిక్ సంచులు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. హెలీక్యాప్టర్ ని సమానంగా పెద్ద పెద్ద కవర్లు గాల్లోకి లేవడం గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.