తెలుగు న్యూస్  /  National International  /  Wpi Inflation Eases To 12.41 Percent In August 2022

WPI inflation in Aug: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణం తగ్గుముఖం

HT Telugu Desk HT Telugu

14 September 2022, 12:57 IST

  • WPI inflation eases in Aug: హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్భణం (డబ్ల్యూపీఐ) ఆగస్టు నెలలో తగ్గింది.

ఆగస్గులో స్వల్పంగా తగ్గిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణం
ఆగస్గులో స్వల్పంగా తగ్గిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణం (HT_PRINT)

ఆగస్గులో స్వల్పంగా తగ్గిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పటికీ, తయారీ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో టోకు (హోల్‌సేల్) ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో వరుసగా మూడో నెలలో 12.41 శాతానికి తగ్గింది.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గతేడాది జూలైలో 13.93 శాతంగా ఉండగా, ఆగస్టులో 11.64 శాతంగా ఉంది. రెండంకెల టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) ఉండడం ఇది వరుసగా 17వ నెల కావడం గమనార్హం.

ఈ ఏడాది మే నెలలో డబ్ల్యూపీఐ రికార్డు స్థాయిలో 15.88 శాతానికి చేరుకుంది. జులైలో 10.77 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.37 శాతానికి పెరిగింది. జూలైలో 18.25 శాతంగా ఉన్న కూరగాయల ధరల పెరుగుదల ఆగస్టు నెలలో 22.29 శాతంగా ఉంది.

ఇంధనం, విద్యుత్తు బాస్కెట్‌లో జూలైలో 43.75 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టులో 33.67 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తులు, నూనె గింజలలో ఇది వరుసగా 7.51 శాతం, మైనస్ 13.48 శాతంగా ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య విధానాన్ని రూపొందించడానికి ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తుంది.

రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఎనిమిదో నెలలో రిజర్వ్ బ్యాంక్ ఎగువ సహన పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఇది 7 శాతంగా ఉంది.

భారీగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది మూడుసార్లు కీలక వడ్డీ రేటును 5.40 శాతానికి పెంచింది.

సెంట్రల్ బ్యాంక్ అంచనాల ప్రకారం 2022-23లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.7 శాతంగా ఉండవచ్చు.

టాపిక్