తెలుగు న్యూస్  /  National International  /  Will Remove Afspa Only After Installing Peace: Amit Shah In Assam

Amit Shah on AFSPA removal: ‘AFSPA రద్దు ఇప్పుడే కాదు..’

HT Telugu Desk HT Telugu

08 October 2022, 18:55 IST

  • Amit Shah on AFSPA removal: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(Armed Forces (Special Powers) Act (AFSPA) పై కేంద్ర హో మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం షా అస్సాం పర్యటనలో ఉన్నారు. 

గువాహటిలో జరిగిన ఒక బహిరంగ సభలో అమిత్ షా
గువాహటిలో జరిగిన ఒక బహిరంగ సభలో అమిత్ షా (Rupjyoti Sarmah )

గువాహటిలో జరిగిన ఒక బహిరంగ సభలో అమిత్ షా

Amit Shah on AFSPA removal: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ను రద్దు చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, అయితే, ముందుగా ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనాల్సి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Amit Shah on AFSPA removal: నెహ్రూ వల్లనే..

1962లో చైనాతో యుద్ధం తరువాత నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అస్సాంకు బైబై చెప్పారని, ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోవడం మానేశారని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత 8 ఏళ్లుగా అస్సాం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.

Amit Shah on AFSPA removal: AFSPA రద్దుపై..

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గురించి మాట్లాడుతూ.. కొందరిని సంతోషపెట్టడం కోసం 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని విమర్శించారు. అయితే, ఆ చట్టాన్ని రద్దు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ, ముందుగా ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెన్సీ, వేర్పాటువాదం పూర్తిగా సమసిపోయి, శాంతి నెలకొన్న తరువాత కచ్చితంగా AFSPA ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Amit Shah on AFSPA removal: బీజేపీ ఆపీస్

అస్సాంలోని గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల్లోనే అతిపెద్ద బీజేపీ పార్టీ ఆఫీస్ ను అమిత్ షా శనివారం ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో 95 వేల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.

టాపిక్