తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Disqualification : ‘మోదీ కళ్లల్లో భయం చూశాను.. పోరాటం ఆపను’

Rahul Gandhi disqualification : ‘మోదీ కళ్లల్లో భయం చూశాను.. పోరాటం ఆపను’

Sharath Chitturi HT Telugu

25 March 2023, 13:45 IST

google News
  • Rahul Gandhi disqualification : లోక్​సభలో అనర్హత వేటు పడిన ఒక రోజు అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. తనపై అనర్హత వేటు వేసినా, అరెస్ట్​ చేసినా.. తాను మాత్రం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ (ANI)

రాహుల్​ గాంధీ

Rahul Gandhi disqualification : తాను సత్యమే మాట్లాడతానని, సత్యం తప్ప తనకు మరొకటి అవసరం లేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. తనపై అనర్హత వేటు వేసినా, తనని అరెస్ట్​ చేసినా.. తాను మాత్రం సత్యం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

లోక్​సభలో తనపై అనర్హత వేటు పడిన ఒక రోజు అనంతరం శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాహుల్​ గాంధీ. మోదీ కళ్లల్లో భయాన్ని చూసినట్టు వివరించారు.

Rahul Gandhi latest news : "ఇదంతా ఓ డ్రామా. నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. రూ.20వేల కోట్లు అదానీ షెల్​ కంపెనీలకు ఎలా వెళ్లాయని ప్రశ్నించాను. ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకే ఈ డ్రామా చేస్తున్నారు. అనర్హత వేటు వేసినా, అరెస్ట్​ చేసినా భయపడను. అదానీపై నేను ఒకటే ప్రశ్న అడిగాను. ఇలా చేశారు. నేను ప్రశ్నించడం ఆపను. ఇండియాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటాను. అదానీపై నా తదుపరి ప్రసంగం వినేందుకు మోదీ భయపడుతున్నారు. అది నేను ఆయన కళ్లల్లో చూశాను. అందుకే నాపై అనర్హత వేటు వేశారు. నాపై శాస్వతంగా అనర్హత వేటు వేసినా.. నేను పోరాటాన్ని ఆపను. నేను పార్లమెంట్​లో ఉన్నానా లేదా బయట ఉన్నానా అన్నది నాకు సంబంధం లేదు. దేశం కోసం పోరాడుతూనే ఉంటాను," అని రాహుల్​ గాంధీ అన్నారు.

ప్రధాని మోదీపై అణుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీని దోషిగా తేల్చింది గుజరాత్​ సూరత్​లోని జిల్లా కోర్టు. ఈ మేరకు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజే.. రాహుల్​ గాంధీ తన ఎంపీ సీటును కోల్పోయారు.

'ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది..'

Rahul Gandhi press meet : దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని తాను చెబుతూనే ఉన్నట్టు కాంగ్రెస్​ నేత అన్నారు. పార్లమెంట్​లో తాను చేసిన ప్రసంగాన్ని పూర్తిగా తొలగించారని ఆరోపించారు రాహుల్​ గాంధీ. ఈ విషయంపై తాను లోక్​సభ స్పీకర్​కు లేఖ రాసినట్టు వివరించారు. తాను విదేశాల నుంచి సాయం కోరుతున్నట్టు.. కొంత మంది మంత్రులు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పిన కాంగ్రెస్​ నేత.. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా.. మోదీ- అదానీ మధ్య ఉన్న బంధంపై తాను ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని తేల్చిచెప్పారు.

"ప్రధానితో ఉన్న సంబంధాన్ని ఉపయోగించుకుని అదానీ వంటి వ్యక్తులు దేశాన్ని దోచుకుంటున్నారు. నేను దానిని అడ్డుకుంటాను. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల రక్షణకు కృషిచేస్తాను. ప్రజల గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను," అని రాహుల్​ గాంధీ తెలిపారు.

తదుపరి వ్యాసం