Adani-Hindenburg case : అదానీ వ్యవహారంపై ప్యానెల్​ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం-adanihindenburg case india top court sets up a 6 member panel to look into the issue ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Adani-hindenburg Case: India Top Court Sets Up A 6 Member Panel To Look Into The Issue

Adani-Hindenburg case : అదానీ వ్యవహారంపై ప్యానెల్​ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

Sharath Chitturi HT Telugu
Mar 02, 2023 11:47 AM IST

Adani-Hindenburg case Supreme court : అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆరుగురు సభ్యుల ప్యానెల్​ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

అదానీ వ్యవహారంపై ప్యానెల్​ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
అదానీ వ్యవహారంపై ప్యానెల్​ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం (HT_PRINT)

Adani-Hindenburg case Supreme court : హిన్​డెన్​బర్గ్​ షార్ట్​ సెల్లింగ్​ నివేదిక నేపథ్యంలో ఆదానీ గ్రూప్​ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి అభయ్​ మనోహ్​ సప్రే నేతృత్వంలో ఓ ఆరుగురు సభ్యుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

'2 నెలల్లో దర్యాప్తు పూర్తవ్వాలి..'

అదానీ గ్రూప్​లో అవకతవకలు జరిగాయంటూ జనవరి 24న ఓ నివేదిక బయటపెట్టింది హిన్​డెన్​బర్గ్​ సంస్థ. అప్పటి నుంచి అదానీ గ్రూప్​పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్​వెస్టర్​లకు రక్షణ కలిగించే విధంగా ప్రస్తుత విధానాల్లో మార్పులు తీసుకురావాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా వీటిపై విచారణ చేపట్టింది సీజేఈ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ క్రమంలోనే ప్యానెల్​ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రముఖ బ్యాంకర్లు కేవీ కామథ్​, ఓపీ భట్​, ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నందన్​ నీలేకని, రిటైర్డ్​ జస్టిస్​ జేపీ దేవ్​దార్​లు ఈ ప్యానెల్​లో సభ్యులుగా ఉండనున్నట్టు పేర్కొంది.

Supreme court Adani row : ఈ ఆరుగురు సభ్యుల ప్యానెల్​.. అదానీ కేసుపై దర్యాప్తు చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడం, వ్యవస్థలోని లోపాలను సరిచేయడం వంటి అంశాలపై ప్యానెల్ కీలక​ సూచనలు చేస్తుందని పేర్కొంది.

మరోవైపు.. అదానీ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తును 2 నెలల్లోగా పూర్తి చేసి, స్టేటస్​ రిపోర్టును సమర్పించాలని మార్కెట్​ రెగ్యులేటరీ సెబీకి ఆదేశాలిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. స్టాక్​ మేన్యుపులేషన్​ జరిగిందా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? వంటి అంశాలను సైతం విచారించి, నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.

ఇదీ కేసు..

Supreme court Adani Hindenburg : అదానీ గ్రూప్​ గత కొంతకాలంగా అక్రమాలకు పాల్పడుతోందని సంచలన నివేదిక బయటపెట్టింది అమెరికాకు చెందిన హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​. దారుణంగా ఉన్న సంస్థ ఆర్థిక వ్యవస్థను ఇంతకాలం అదానీ బృందం తప్పుడు మార్గాల్లో కప్పిపుచ్చుకుంటూ వచ్చిందని, భారీ మొత్తంలో స్టాక్​ మేన్యుపులేషన్​కు పాల్పడిందని ఆరోపించింది. అందుకే.. వాస్తవ వాల్యుయేషన్​ కన్నా అదానీ గ్రూప్​ స్టాక్స్​ ఎన్నో రేట్లు ఎక్కువ స్థాయిలో ట్రేడ్​ అవుతున్నట్టు పేర్కొంది.

ఈ నివేదిక బయటకి వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్​ స్టాక్స్​లో రక్తపాతం కొనసాగుతోంది. అన్నీ అదానీ స్టాక్స్​లో సంపద దాదాపు సగానికిపైగా ఆవిరైపోయింది. మదుపర్లకు తేరులేని విధంగా దెబ్బపడింది.

Supreme court Adani hearing : అదానీ గ్రూప్​పై జేపీసీ నియమించాలని ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి చేశాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

WhatsApp channel