Adani stocks: అనూహ్యంగా పుంజుకున్న ఆదానీ స్టాక్స్-most of adani group stocks bounce back ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Most Of Adani Group Stocks Bounce Back

Adani stocks: అనూహ్యంగా పుంజుకున్న ఆదానీ స్టాక్స్

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 08:31 PM IST

Adani stocks: హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో గత నెల రోజులుగా వరుసగా పతనమవుతున్న ఆదానీ గ్రూప్ షేర్లు మంగళవారం స్వల్పంగా పుంజుకున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

Adani stocks: ఆదానీ గ్రూప్ లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల స్టాక్స్ లో 8 కంపెనీల స్టాక్స్ మంగళవారం స్వల్పంగా బలపడ్డాయి.

Adani stocks: 10లో 8 పాజిటివ్..

ఆదానీ గ్రూప్ లోని ఫ్లాగ్ షిప్ కంపెనీ ఆదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ విలువ (Adani Enterprises) మంగళవారం 14.22% బలపడి, రూ. 1364.05 వద్ద స్థిరపడింది. అలాగే, ఆదానీ పోర్ట్స్ షేరు (Adani Ports) 5.44% బలపడింది. ఆదానీ గ్రీన్ , ఆదానీ విల్మర్ కంపెనీల షేర్లు 5% బలపడగా, ఎన్డీటీవీ షేర్ 4.99% మెరుగైంది. ఆదానీ పవర్ (Adani Power) షేరు కూడా 4.98% బలపడింది. అంబుజా సిమెంట్ 9Ambuja Cements) షేర్ వాల్యూ 3.75%, మరో సిమెంట్ కంపెనీ ఏసీసీ 2.24% బలపడింది. ఆదానీ గ్రూప్ లోని ఆదానీ ట్రాన్స్ మిషన్ షేర్ విలువ 5% తగ్గిపోగా, ఆదానీ టోటల్ గ్యాస్ 4.99% నష్టపోయింది.

Adani stocks: హిండెన్ బర్గ్ రీసెర్చ్

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక బహిర్గతమైన జనవరి 24నుంచి ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోవడం ప్రారంభమైంది. ఆదానీ గ్రూప్ లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీలు కలిపి మొత్తం రూ. 12,07,848.69 కోట్లు నష్టపోయాయి. ఆర్థిక అవకతవకలకు, పన్ను ఎగవేతకు, కంపెనీ షేర్ల ఓవర్ వ్యాల్యుయేషన్ కు పాల్పడ్డాడని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీపై హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలు చేసింది.

WhatsApp channel