హిండెన్ బర్గ్ (Hindenburg) నివేదిక జనవరి 24న వెల్లడైంది. ఆ నాటి నుంచి ఆదానీ గ్రూప్ (Adani Group) షేర్లు కుప్పకూలడం ప్రారంభమైంది. దాంతో, ఆదానీ గ్రూప్ కంపెనీలతో పాటు వాటిలో భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) కూడా దారుణంగా నష్టపోయింది. ఆదానీకి చెందిన చాలా కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది. ఆదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్ వాల్యూ దారుణంగా పడిపోవడంతో వాటిలోని ఎల్ఐసీ పెట్టుబడులు కూడా నష్టపోయాయి. ఆదానీ దెబ్బకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) నెల రోజుల వ్యవధిలో సుమారు రూ. 48,600 కోట్లు నష్టపోయింది.
ఆదానీకి చెందిన ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises), ఆదానీ ట్రాన్స్ మిషన్ (Adani Transmission), ఆదానీ టోటల్ గ్యాస్(Adani Total Gas), ఆదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) ల్లో ఎల్ఐసీ (LIC) పెట్టుబడులు పెట్టింది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) లో ఎల్ఐసీకి 4,81,74,654 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. అంటే, సుమారు 4.23% షేర్లు. అలాగే, ఆదానీ ట్రాన్స్ మిషన్ (Adani Transmission) లో ఎల్ఐసీ (LIC) కి 4,06,76,207 (3.65%) షేర్లు ఉన్నాయి. ఆదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) లో ఎల్ఐసీ (LIC) కి 6,55,88,170 (3.65%) ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఆదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) లో లో ఎల్ఐసీ కి 2,03,09,080 (1.28%) ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఆదానీ కి చెందిన సిమెంట్ బిజినెస్ లో కూడా ఎల్ఐసీ (LIC) పెట్టబడులు పెట్టింది. ఆదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ లో ఎల్ఐసీకి 12,55,89,263 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇది సంస్థ మొత్తం హోల్డింగ్స్ లో 6.33%. ఏసీసీ లో ఎల్ఐసీ (LIC) కి 6.41% వాటాతో 1,20,33,271 ఈక్విటీ షేర్లున్నాయి. అయితే, వీటన్నింటికన్నా ఎక్కువగా ఆదానీ పోర్ట్స్ (Adani Ports) లో ఎల్ఐసీ (LIC) కి 19,75,26,194 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇది సంస్థ మొత్తం షేర్లలో 9.14%. ఆదానీ విల్మర్, ఆదానీ పవర్, ఎన్డీటీవీల్లో ఎల్ఐసీ (LIC) పెట్టుబడులు పెట్టలేదు.
జనవరి 24 నాటికి ఆదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల్లో ఎల్ఐసీకి ఉన్న వాటాల విలువ రూ. 81,267.75 కోట్లు. సరిగ్గా నెల రోజుల తరువాత, ఫిబ్రవరి 24 నాటికి ఆదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల్లో ఎల్ఐసీ (LIC) వాటా విలువ రూ. 32,618.56 కోట్లకు పడిపోయింది. అంటే నెల రోజుల వ్యవధిలో ఎల్ఐసీ సుమారు రూ. 48,600 కోట్లు నష్టపోయింది.
టాపిక్