Adani Hindenburg report : 'అదానీ'పై ఆ నివేదికతో.. నెల రోజుల్లో రూ. 12లక్షల కోట్ల మార్కెట్ వాల్యూ ఉఫ్!
Adani Hindenburg report : హిన్డెన్బర్గ్ నివేదిక సృష్టించిన ప్రకంపనలు అదానీ గ్రూప్‌ను వెంటాడుతున్నాయి. నెల రోజుల్లో ఈ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ వాల్యూ రూ. 12లక్షల కోట్ల మేర కరిగిపోయింది!
Adani Hindenburg report : అదానీ గ్రూప్‌పై నెల రోజుల క్రితం విడుదలైన సంచలనాత్మక హిన్డెన్బర్గ్ నివేదికతో మదుపర్లకు నిద్ర లేని రాత్రులు కొనసాగుతున్నాయి! నెల రోజులైనప్పటికీ.. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి తగ్గడం లేదు. మొత్తం మీద.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ వాల్యూ రూ. 12లక్షల కోట్ల మేర పతనమైంది. ఫలితంగా మదుపర్లకు భారీ నష్టాన్ని ముగిల్చాయి.
నెల రోజుల్లో.. రక్తపాతం!
2024 జనవరి 24న.. 19లక్షల కోట్ల మార్కెట్ వాల్యుయేషన్‌తో నెం.1 స్థానంలో నిలిచింది అదానీ గ్రూప్. ముకేశ్ అంబానీ రిలయన్స్, రతన్ టాటా టీసీఎస్‌ను అధిగమించింది. అప్పటివరకు.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడుల కోసం మదుపర్లు పరుగులు తీశారు. కానీ అమెరికా ఆధారిత హిన్డెన్బర్గ్.. తన నివేదికతో ప్రకంపనలు సృష్టించింది. మదుపర్లను కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఇదీ చదవండి :- అదానీకి దక్కిన 'అమృత కాలం'తో బీజేపీకి నష్టం తప్పదా?
Adani Hindenburg row : ఈ పరిణామాల మధ్య.. నెల రోజుల్లో అదానీ స్టాక్స్‌లో రక్తపాతం పతాక స్థాయికి చేరింది. అనేక స్టాక్స్.. 1 ఇయర్ లోస్లో ఉండటంతో పాట బ్యాక్-టు- బ్యాక్ లోవర్ సర్క్యూట్లను టచ్ చేస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈలో అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ వాల్యూ రూ. 7,15,986.97కోట్లకు చేరింది. అంటే నెల రోజుల్లో రూ. 12లక్షల కోట్ల నష్టం కలిగినట్టు! పీక్ స్టేజ్ నుంచి పోల్చుకుంటే.. అదానీ గ్రూప్ మార్కెట్ వాల్యుయేషన్ దాదాపు 70శాతం పడినట్టు. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. అదానీ సంస్థల పీక్ మార్కెట్ వాల్యుయేషన్ సుమారు రూ. 25లక్షల కోట్లు.
ఇదీ స్టాక్స్ పరిస్థితి..
Adani group stocks price : అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ధర నెల రోజుల్లో 2,077 పాయింట్లు కోల్పోయి 61.30శాతం పతనమైంది. అదానీ పోర్ట్స్ షేరు ధర 21.5శాతం పడింది. అదానీ గ్రీన్ స్టాక్ ఏకంగా 1,371 పాయంట్ల నష్టంతో 73.8శాతం నష్టపోయింది. అదానీ గ్యాస్ 79.4శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 71.71శాతం మేర పడ్డాయి.