NirmalaSitharaman on Adani crisis: ఆదానీ సంక్షోభంపై స్పందించిన నిర్మల సీతాారామన్-well within limit nirmala sitharaman on lic sbi exposure in adani group firms ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nirmalasitharaman On Adani Crisis: ఆదానీ సంక్షోభంపై స్పందించిన నిర్మల సీతాారామన్

NirmalaSitharaman on Adani crisis: ఆదానీ సంక్షోభంపై స్పందించిన నిర్మల సీతాారామన్

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 07:26 PM IST

Nirmala Sitharaman on Adani crisis: దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆదానీ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. దేశ ఆర్థిక రంగం సజావుగా సాగుతోందని వ్యాఖ్యానించారు.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Photo: PTI)

Nirmala Sitharaman on Adani crisis: దేశ ఆర్థిక రంగ నిర్వహణ సమర్ధవంతంగా, సజావుగా సాగుతోందని, ఆందోళన అక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసి, రాజకీయంగా పెను దుమారం రేపుతున్న ఆదానీ సంస్థల అవకతవకలపై (Adani crisis) తొలిసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు.

Nirmala Sitharaman on Adani crisis: ఒక్క సంఘటన ఆధారంగా నిర్ణయించలేం

భారతీయ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు సమర్దవంతమైన నిర్వహణ లో ఉన్నాయని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) స్పష్టం చేశారు. ఒక్క సంఘటన, దానిపై అంతర్జాతీయంగా ఎంత ప్రచారం జరిగినా సరే, ఆ ఒక్క సంఘటన ఆధారంగా దేశ ఫైనాన్షియల్ మార్కెట్ల నిర్వహణపై నిర్ధారణకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ (LIC), ఎస్బీఐ (SBI) లు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయంపై (Adani crisis) అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అనుమతించిన పరిమితికి లోబడే ఆ పెట్టుబడులున్నాయన్నారు. ఇప్పటికే ఆ విషయమై ఎల్ఐసీ (LIC), ఎస్బీఐ (SBI) సవివరమైన ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

Nirmala Sitharaman on Adani crisis: బ్యాంకింగ్ రంగంపై భయాలొద్దు

దేశీయ బ్యాంకింగ్ రంగం గురించి ఎలాంటి అనుమానాలుకానీ భయాందోళనలు కానీ అవసరం లేదని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) హామీ ఇచ్చారు. దేశీయ బ్యాంకింగ్ రంగం సజావుగా, సమర్ధవంతమైన నిర్వహణలో సాగుతోందని స్పష్టంచేశారు. ఆదానీ వివాదంపై అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రచారంపై నిర్మల (Nirmala Sitharaman) స్పందించారు. భారతదేశ నియంత్రణ సంస్థలు (regulators) అత్యంత నిపుణులైన వ్యక్తుల నిర్వహణలో ఉన్నాయని, కఠిన నిబంధనలను అమలు చేస్తూ, ఎలాంటి అవకతవకలకు అవకాశంలేకుండా పని చేస్తున్నాయని వివరించారు. ఆదానీ అవకతవకల ఆరోపణలను (Adani crisis) ప్రస్తావిస్తూ.. ఒకటో, అరో ఘటనల ఆధారంగా వాటి పని తీరుపై అంచనాకు రాకూడదని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) సూచించారు. ఆదానీ సంక్షోభం (Adani crisis) కొనసాగుతున్న సమయంలోనూ, బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లు పైపైకి వెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

Whats_app_banner