FM Sitharaman: కేంద్ర బడ్జెట్‌లో 7 ప్రాధాన్యతలు ఇవే..
FM Sitharaman: యూనియన్ బడ్జెట్ 2023-24 ఏడు ప్రాధాన్యతల ఆధారంగా రూపొందిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్‌లోని ఏడు ప్రాధాన్యతలను ప్రకటించారు.
సమ్మిళిత అభివృద్ధి, చివరి మైలువరకు చేరుకోవడం, ఇన్‌ఫ్రా - పెట్టుబడులు, సామర్థ్యాలను ఆవిష్కరించడం, హరిత వృద్ధి, యువశక్తి, ఆర్థిక రంగం తమ ఏడు ప్రాధాన్యతలను వివరించారు.
దేశంలోని అగ్రి స్టార్టప్‌లకు సహాయం చేయడానికి అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు సహాయం అందించే ప్యాకేజీగా ప్రధానమంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్‌ను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. తమ ఉత్పత్తుల నాణ్యత మెరుగుపరుస్తామని, ఈ వ్యాపారవేత్తలను ఎంఎస్ఎంఈ వాల్యూ చైన్‌తో అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
టాపిక్