Priyanka Gandhi: రాహుల్ గాంధీ అనర్హత పై ప్రియాంక గాంధీ సీరియస్ రియాక్షన్
Priyanka Gandhi: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటోంది. ఈ విషయంపై రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా తీవ్రంగా మండిపడ్డారు.
Priyanka Gandhi: రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనర్హత అంశంపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) స్పందించారు. బీజేపీపై మండిపడుతూ ఒక ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసి, రెండేళ్ల జైలు శిక్ష పడి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతకు గురైన రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మద్ధతుగా కాంగ్రెస్ సీనియర్లు నిలిచారు.
Priyanka Gandhi reaction on Rahul's disqualification: అవినీతికే మీ మద్దతా?
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ లోని వాయినాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ (Rahul Gandhi) ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్న రాహుల్ (Rahul Gandhi) కు మద్దతుగా ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఒక ట్వీట్ చేశారు. ‘‘నీరవ్ మోదీ (Nirav Modi) స్కామ్ రూ. 14 వేల కోట్లు.. లలిత్ మోదీ (Lalit Modi) స్కామ్ రూ. 426 కోట్లు.. మెహుల్ చోస్కీ (Mehul choski) స్కామ్ రూ. 13 వేల కోట్లు.. ప్రజాధనాన్ని దోచుకున్నవారికి బీజేపీ ఎందుకు సహకరిస్తోంది? వారిపై విచారణను ఎందుకు అడ్డుకుంటోంది? ఈ విషయాలపై ప్రశ్నించిన వారిపై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారు. బీజేపీ అవినీతిపరులకే మద్దతు ఇస్తుందా?’’ అని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆ ట్వీట్ లో ఘాటుగా ప్రశ్నంచారు. అవినీతి పరులందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉందని 2019లో కర్నాటకలో జరిగిన ఒక సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. అది మోదీ ఇంటిపేరున్న అందరినీ అవమానించడమేనని కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. దానిపై మార్చి 23న సూరత్ లోని ఒక కోర్టు తీర్పు ప్రకటిస్తూ, రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడని పేర్కొంటూ మార్చి 24న లోక్ సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అనర్హత కారణంగా, ఒకవేళ పై కోర్టు ఈ జైలుశిక్షపై స్టే విధించని పక్షంలో, మొత్తం 8 ఏళ్ల పాటు రాహుల్ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి కుదరదు.
Congress reaction on Rahul's disqualification: కాంగ్రెస్ పోరుబాట
రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తీసుకుంది. దీనిపై అటు కోర్టులో, ఇటు ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామని ప్రకటించింది. ఇలాంటి బెదరింపులకు భయపడబోమని, ప్రశ్నించడం ఆపివేయబోమని స్పష్టం చేసింది. ‘మోదీ ఆదానీ అనుబంధంపై తేల్చడానికి జేపీసీ వేయాలని కోరితే, రాహుల్ ను డిస్ క్వాలిఫై చేశారు. భారతీయ ప్రజాస్వామ్యం ఓం శాంతి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు.