తెలుగు న్యూస్  /  National International  /  Whatsapp Tweets Video With Incorrect India Map, Gets Schooled By Union Minister

WhatsApp tweets incorrect India map video: వాట్సాప్ కు కేంద్ర మంత్రి హెచ్చరిక

HT Telugu Desk HT Telugu

31 December 2022, 22:18 IST

  • WhatsApp tweets incorrect India map video: భారత దేశ పటాన్ని తప్పుగా ట్వీట్ చేసిన వాట్సాప్ పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మండిపడ్డారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp tweets incorrect India map video: భారత దేశ పటాన్ని తప్పుగా ట్వీట్ చేసిన వాట్సాప్ పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత దేశ చిత్ర పటం విషయంలో జరిగిన పొరపాటును సాధ్యమైనంత త్వరగా సరిదిద్దాలని ట్వీటర్ లో ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

WhatsApp tweets incorrect India map video: గతంలో జూమ్ సీఈఓ ను కూడా..

జూమ్ సీఈఓ ఎరిక్ యువన్ (Zoom CEO Eric Yuan) ను కూడా ఇదే విషయంలో గతంలో కేంద్ర మంత్రి రాజీవ్ హెచ్చరించారు. జూమ్ సీఈఓ ఎరిక్ యువన్ (Zoom CEO Eric Yuan) కూడా డిసెంబర్ 28 న భారత్ కు సంబంధించిన తప్పుడు మ్యాప్ ను షేర్ చేశారు. ‘భారత్ లో బిజినెస్ చేయాలనుకుంటే, ముందు భారత్ కు చెందిన సరైన మ్యాప్ ను వాడడం అలవాటు చేసుకోండి’ అని అప్పుడు రాజీవ్ చంద్ర శేఖర్ హెచ్చరించారు. దాంతో, ఆ ట్వీట్ ను ఎరిక్ యువన్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు.

WhatsApp tweets incorrect India map video: జమ్మూకశ్మీర్ పై..

మళ్లీ ఇప్పుడు అదే పొరపాటును వాట్సాప్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ‘డియర్ వాట్సాప్.. సాధ్యమైనంత త్వరగా భారత దేశ పటం విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దండి. భారత్ లో కార్యకలాపాలు నిర్వహించాలనుకునే అన్ని ప్లాట్ ఫామ్స్, భారత్ లో తమ బిజినెస్ ను కొనసాగించాలనుకుంటే కచ్చితంగా భారతదేశానికి సంబంధించి సరైన మ్యాప్ నే వాడాలి’ అని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ ఘాటుగా హెచ్చరిస్తూ, ట్వీట్ చేశారు. ట్విటర్ అధికారిక హ్యాండిల్ లో భారత్ లో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ సమాచారంతో వాట్సాప్ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో భారతదేశంలోని జమ్మూకశ్మీర్ కు సంబంధించి తప్పుడు మ్యాప్ ను చూపారు.