తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cds Ii Final Results: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్ ను ప్రకటించిన యూపీఎస్సీ

CDS II Final Results: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్ ను ప్రకటించిన యూపీఎస్సీ

HT Telugu Desk HT Telugu

23 April 2024, 14:42 IST

google News
  • UPSC CDS II Final Result 2023: త్రివిధ దళాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ -2 ఫైనల్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల విడుదల
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల విడుదల

యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల విడుదల

UPSC CDS II Final Result 2023: యూపీఎస్సీ సీడీఎస్-2 2023 ఫైనల్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2) 2023కు హాజరైన అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.

ఐఎంఏ లో అడ్మిషన్లు

ఇండియన్ మిలిటరీ అకాడమీ 157 (DE) కోర్సులో ప్రవేశం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 సెప్టెంబరులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2)ను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూల అనంతరం తుది ఫలితాలను నేడు ప్రకటించారు. చివరగా, ఇండియన్ మిలిటరీ అకాడమీ 157 (DE) కోర్సులో ప్రవేశం కోసం మొత్తం 197 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీ (Indian Military Academy), కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియల్ నేవల్ అకాడమీ (Indian Naval Academy), తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ (Air Force Academy) (ప్రి ఫ్లయింగ్) ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ లభిస్తుంది.

యూపీఎస్సీ సీడీఎస్-2 ఫైనల్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి

అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న యూపీఎస్సీ సీడీఎస్ 2 ఫైనల్ రిజల్ట్ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • ఆ పీడీఎఫ్ లో అభ్యర్థులు తమ రోల్ నంబర్ల ఆధారంగా రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.
  • ఆ తరువాత, రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
  • మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

తదుపరి వ్యాసం